Badi Bata Schedule 2025: సర్కార్ బడుల్లో బడిబాట పండగ.. షెడ్యూల్‌ విడుదల చేసిన విద్యాశాఖ! ఏ రోజున ఏం చేస్తారంటే..

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు రేవంత్‌ సర్కార్‌ జూన్‌ 6 నుంచి 19వ తేదీ వరకు బడిబాట ప్రోగ్రామ్‌ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు నరసింహారెడ్డి తాజాగా ఈ కార్యక్రమంకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా..

Badi Bata Schedule 2025: సర్కార్ బడుల్లో బడిబాట పండగ.. షెడ్యూల్‌ విడుదల చేసిన విద్యాశాఖ! ఏ రోజున ఏం చేస్తారంటే..
Badi Bata Programme

Updated on: May 19, 2025 | 8:04 AM

హైదరాబాద్‌, మే 19: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు రేవంత్‌ సర్కార్‌ జూన్‌ 6 నుంచి 19వ తేదీ వరకు బడిబాట ప్రోగ్రామ్‌ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు నరసింహారెడ్డి తాజాగా ఈ కార్యక్రమంకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా మే 31 నాటికి పాఠశాలల్లో మరమ్మతులు పూర్తి చేయాలని ఆదేశించింది. జూన్‌ 12వ తేదీన విద్యా సంవత్సరం పునఃప్రారంభం కానుండటంతో పాఠశాలలను అలంకరించాలని, బడులలో పండగ వాతావరణం తీసుకురావాలని విద్యాశాఖ భావిస్తుంది. ఇందులో తల్లిదండ్రులను, గ్రామస్థులను భాగస్వామ్యం చేస్తూ స్వాగతం పలకాలని, తదనుగుణంగా పేరెంట్‌ టీచర్‌ మీటింగ్‌ (పీటీఎం) నిర్వహించాలని అధికారులను ఆదేశించింది.

బడిబాట షెడ్యూల్‌ 2025 రోజువారీ కార్యక్రమాలు ఇవే..

  • జూన్‌ 6న స్థానిక ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులను భాగస్వామ్యం చేస్తూ పెద్ద ఎత్తున గ్రామసభ నిర్వహించాలి.
  • జూన్‌ 7న ఉపాధ్యాయులు ప్రతి ఇంటిని సందర్శించి బడీడు పిల్లలను గుర్తించాలి.
  • జూన్‌ 8, 9, 10 తేదీల్లో కరపత్రాలతో ఇంటింటి ప్రచారం చేయాలి. అలాగే గ్రామాల్లోని అంగన్‌వాడీ కేంద్రాల సందర్శన చేపట్టాలి. గ్రామాల్లోని డ్రాపౌట్‌ పిల్లలను గుర్తించి బడిలో చేర్పించేలా ఏర్పాట్లు చేయాలి. ప్రత్యేకావసరాలున్న పిల్లలను గుర్తించి అందుబాటులో ఉన్న భవిత కేంద్రాల్లో చేర్పించాలి.
  • జూన్‌ 11వ తేదీన జూన్‌ 6 నుంచి 10వ తేదీ వరకు నిర్వహించిన కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించడం జరుగుతుంది.
  • జూన్‌ 12న అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ఆధ్వర్యంలో చేపట్టిన పనులను ప్రజాప్రతినిధులతో ప్రారంభించాలి. అదేరోజు బడిలో చేరిన విద్యార్థులకు పాఠ్య, నోట్‌ పుస్తకాలతోపాటు యూనీఫాం కూడా అందించాలి.
  • జూన్‌ 13న ప్రజాప్రతినిధులు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులు, తల్లిదండ్రులు, గ్రామస్థులతో మీటింగ్‌ ఏర్పాటు చేసి సామూహిక అక్షరాభ్యాసం, బాలసభ నిర్వహించాలి.
  • జూన్‌ 16న ఫౌండేషనల్‌ లిటరసీ అండ్‌ న్యూమరసీ (ఎఫ్‌ఎల్‌ఎన్‌), లెర్నింగ్‌ ఇంప్రూవ్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ (లిప్‌) దినోత్సవం జరపాలి.
  • జూన్‌ 17న అన్ని పాఠశాలలలో సమీకృత విద్య, బాలిక విద్యా దినోత్సవం నిర్వహించాలి. బాలికా వివాహాలు, చిన్నారులపై వేధింపులకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించాలి.
  • జూన్‌ 18న తల్లిదండ్రులను, గ్రామస్థులను పాఠశాలలకు ఆహ్వానించి తరగతి గదుల్లో ఏర్పాటు చేసిన డిజిటలీకరణ, ఇతర ఆధునిక సౌకర్యాలను చూపించి, వాటి గురించి వివరించాలి.
  • జూన్‌ 19న బడిబాట ముగింపు రోజు. ఈ రోజున విద్యార్థులకు క్రీడాపోటీలు నిర్వహించి బహుమతులు ప్రధానం చేయాలి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.