Cognizant: ఫ్రెషర్స్‌కు గుడ్ న్యూస్‌.. కాగ్నిజంట్‌లో 50 వేల ఉద్యోగాలు.. ఒక్క ఏడాదిలోనే..

Cognizant: కరోనా మహమ్మారి కారణంగా దేశ వ్యాప్తంగా నియమకాల ప్రక్రియ కాస్త నెమ్మదించిన విషయం తెలిసిందే. ఆర్థికంగా దేశాలన్నీ చిన్నాభిన్నం కావడంతో ఉద్యోగాల భర్తీ తగ్గింది. ముఖ్యంగా ఐటీ ఆధారిత కంపెనీలు...

Cognizant: ఫ్రెషర్స్‌కు గుడ్ న్యూస్‌.. కాగ్నిజంట్‌లో 50 వేల ఉద్యోగాలు.. ఒక్క ఏడాదిలోనే..

Updated on: Feb 04, 2022 | 5:34 PM

Cognizant: కరోనా మహమ్మారి కారణంగా దేశ వ్యాప్తంగా నియమకాల ప్రక్రియ కాస్త నెమ్మదించిన విషయం తెలిసిందే. ఆర్థికంగా దేశాలన్నీ చిన్నాభిన్నం కావడంతో ఉద్యోగాల భర్తీ తగ్గింది. ముఖ్యంగా ఐటీ ఆధారిత కంపెనీలు సైతం ఆశించిన స్థాయిలో లాభాలు సాధించకపోవడంతో కంపెనీలు వీలైనంత వరకు కొత్త నియామకాలకు దూరంగా ఉంటూ వచ్చాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం పరిస్థితులు కాస్త మారాయి. నియమకాల జోరు పెరిగింది.

ఈ క్రమంలోనే ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ కాగ్నిజంట్‌ 2022లో ఏకంగా 50 వేల మంది ఫ్రెషర్స్‌ను తీసుకోనుంది. కాగ్నిజంట్‌ చరిత్రలో ఒక ఏడాదిలో ఇంత పెద్ద మొత్తంలో ఉద్యోగులను నియమించుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇక గతేడాది ఈ కంపెనీ దేశీయంగా 33 వేల మంది ఫ్రెషర్స్‌ను నియమించుకుంది. దీంతో 201 అక్టోబర్‌ నాటికి కాగ్నిజంట్‌లో మొత్తం ఉద్యోగుల సంఖ్య 3,30,600కు చేరింది.

ఇదిలా ఉంటే 2021 నాటికి కాగ్నిజంట్‌ సుమారు 1.39 లక్షల కోట్ల ఆదాయాన్ని నమోదు చేసుకుంది. 2020తో పోలిస్తే ఇది రెండంకెల వృద్ధి రేటు కావడం విశేషం. ఇక వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో 10.2 శాతం నుంచి 11.2 శాతానికి ఆదాయం పెరుగుతుందని సంస్థ అంచనా వేస్తోంది.

Also Read: AHA Unstoppable: మంచు లక్ష్మి, విష్ణు.. వీరిద్దరిలో మీ డబ్బును ఎవరు బాగా ఖర్చు పెడతారు ? బాలయ్య ప్రశ్నకు మోహన్‌బాబు సమాధానం ఏమిటంటే..

Liger Movie: ఫైనల్ షెడ్యూల్‌కు సిద్ధమైన లైగర్.. నెట్టింట్లో ఫొటోలు షేర్ చేసిన చార్మి..

Liger Movie: ఫైనల్ షెడ్యూల్‌కు సిద్ధమైన లైగర్.. నెట్టింట్లో ఫొటోలు షేర్ చేసిన చార్మి..