CMRL Recruitment: చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ (CMRL) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. వివిధ విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను కాంట్రాక్ట్ విధానంలో తీసుకోనున్నారు. దరఖాస్తుల స్వీకరణకు గడువు రేపటితో (మార్చి 11) ముగియనున్న నేపథ్యంలో ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎవరు అర్హులు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 19 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* అండర్‌గ్రౌండ్ కన్‌స్ట్రక్షన్, క్వాలిటీ అష్యూరెన్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్,సేఫ్టీ, డిజైన్ విభాగాల్లో ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో జనరల్ మేనేజర్ (01), అడిషనల్ జనరల్ మేనేజర్ (02), జాయింట్ జనరల్ మేనేజర్ (02), డిప్యూటీ జనరల్ మేనేజర్ (01), డిప్యూటీ జనరల్ మేనేజర్ (01), మేనేజర్ (04), డిప్యూటీ మేనేజర్ (04), అసిస్టెంట్ మేనేజర్ (04) ఖాళీలు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పోస్టుల ఆధారంగా సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ/డిప్లొమా, బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వీటితో పాటు సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి.
* అభ్యర్థుల వయసు 2022 ఫిబ్రవరి 25 నాటికి 30 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* దరఖాస్తులను జాయింట్ జనరల్ మేనేజర్ (హెచ్‌ఆర్), చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్, సీఎమ్‌ఆర్‌ఎల్ డిపో, అడ్మిన్ బిల్డింగ్, కొయంబత్తూరు, చెన్నై, 600107 అడ్రస్‌కు పంపించాలి.
* అభ్యర్థులను మొదట పని అనుభవం, అకడమిక్ అర్హత ఆధారంగా షార్ట్‌లిస్టింగ్ చేస్తారు. అనంతరం ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 60,000 నుంచి రూ. 2,25,000 వరకు జీతంగా చెల్లిస్తారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: Road Accident: రోడ్డు ప్రమాదంలో ఎంపీ కుమారుడు దుర్మరణం.. మరొకరికి తీవ్రగాయాలు..
Viral Video: ఉత్తి చేతులతో బాంబు డిఫ్యూజ్ చేసిన ఉక్రేనియన్.. వీడియో చూస్తే మీకు ఫ్యూజులౌట్..!
Mother Love : ఈ వీడియో చూస్తే మీరు తప్పక ఎమోషనల్ అవుతారు..! తల్లడిల్లిన తల్లి సింహం.. వీడియో