CMAT 2026 Application: సీమ్యాట్‌ 2026 నోటిఫికేషన్‌ వచ్చేసిందోచ్‌.. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు షురూ

CMAT-2026 Notification: సీమ్యాట్‌ 2026 నోటిఫికేషన్‌ను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీయే) విడుదల చేసింది. ఇందులో వచ్చిన స్కోరుతో 2026-2027 విద్యా సంవత్సరానికి దేశవ్యాప్తంగా ఉన్న మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో ప్రవేశాలు పొందడానికి అవకాశం ఉంటుంది. డిగ్రీ పూర్తిచేసినవారితోపాటు డిగ్రీ చివరి సంవత్సరం కోర్సులు

CMAT 2026 Application: సీమ్యాట్‌ 2026 నోటిఫికేషన్‌ వచ్చేసిందోచ్‌.. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు షురూ
CMAT 2026 Notification

Updated on: Oct 18, 2025 | 4:44 PM

కామన్‌ మేనేజ్‌మెంట్‌ అడ్మిషన్‌ టెస్టు (సీమ్యాట్‌ 2026) నోటిఫికేషన్‌ను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీయే) విడుదల చేసింది. ఇందులో వచ్చిన స్కోరుతో 2026-2027 విద్యా సంవత్సరానికి దేశవ్యాప్తంగా ఉన్న మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో ప్రవేశాలు పొందడానికి అవకాశం ఉంటుంది. డిగ్రీ పూర్తిచేసినవారితోపాటు డిగ్రీ చివరి సంవత్సరం కోర్సులు చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు నవంబర్‌ 17, 2025వ తేదీలోపు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోండి..

కామన్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ టెస్ట్ (సీమ్యాట్‌)-2026కు దరఖాస్తు చేసుకునే వారు ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. ప్రస్తుతం డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్ధులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్ధులకు ఎలాంటి వయోపరిమితి లేదు. అంటే ఏ వయసు వారైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో నవంబర్‌ 17, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుము కింద జనరల్‌ (యూఆర్‌) అభ్యర్ధులు రూ.2,500, జనరల్‌- ఈడబ్ల్యూఎస్‌, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఓబీసీ-(ఎన్‌సీఎల్‌), మహిళలు, థర్డ్ జెండర్‌ అభ్యర్ధులు రూ.1250 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది.

రాత పరీక్ష విధానం

సీమ్యాట్‌ పరీక్ష మొత్తం 400 మార్కులకు ఉంటుంది. మొత్తం 100 ప్రశ్నలకు పరీక్ష ఉంటుంది. ఇందులో ఒక్కో సెక్షన్‌ నుంచి 20 చొప్పున మొత్తం 5 విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఒక్కో ప్రశ్నకు 4 మార్కులు చొప్పున కేటాయిస్తారు. క్వాంటిటేటివ్‌ టెక్నిక్స్‌ అండ్‌ డేటా ఇంటర్‌ప్రిటేషన్‌, లాజికల్‌ రీజనింగ్‌, లాంగ్వేజ్‌ కాంప్రహెన్షన్‌, జనరల్‌ అవేర్‌నెస్‌, ఇన్నొవేషన్‌ అండ్‌ ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. 3 గంటల వ్యవధిలో ఆన్‌లైన్‌ విధానంలో ఈ పరీక్ష నిర్వహిస్తారు. నెగెటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికీ ఒక్కో మార్కు చొప్పున కోత విధిస్తారు. ప్రశ్నపత్రం ఇంగ్లీష్‌ మీడియంలో మాత్రమే ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ముఖ్యమైన తేదీలు ఇవే..

  • ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: నవంబర్‌ 17, 2025.
  • ఫీజు చెల్లింపుకు చివరి తేదీ: నవంబర్‌ 18, 2025.
  • దరఖాస్తు సవరణ తేదీలు: నవంబర్‌ 20 నుంచి 22 వరకు.
  • సీమ్యాట్‌ పరీక్ష తేదీ: త్వరలో వెల్లడిస్తారు.

సీమ్యాట్‌ 2026 నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.