CMAT 2025 Exam: మరో రెండు రోజుల్లో సీమ్యాట్‌ ప్రవేశ పరీక్ష.. వెబ్‌సైట్లో అడ్మిట్‌ కార్డులు విడుదల

|

Jan 22, 2025 | 7:34 AM

మేనేజ్ మెంట్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్‌ మేనేజ్‌మెంట్‌ అడ్మిషన్‌ టెస్టు (సీమ్యాట్‌)-2025 పరీక్ష అడ్మిట్‌ కార్డులను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీయే) తాజాగా విడుదల చేసింది. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు అధికారిక వెబ్ సైట్ నుంచి అడ్మిట్ కార్డులు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మరో రెండు రోజుల్లో ఈ పరీక్ష జరగనుంది..

CMAT 2025 Exam: మరో రెండు రోజుల్లో సీమ్యాట్‌ ప్రవేశ పరీక్ష.. వెబ్‌సైట్లో అడ్మిట్‌ కార్డులు విడుదల
CMAT 2025 Exam
Follow us on

హైదరాబాద్, జనవరి 22: కామన్‌ మేనేజ్‌మెంట్‌ అడ్మిషన్‌ టెస్టు (సీమ్యాట్‌)-2025 అడ్మిట్‌ కార్డులను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీయే) విడుదల చేసింది. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అప్లికేషన్‌ నెంబరు, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి అడ్మిట్‌ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా జనవరి 25న 107 పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్ష జరగనుంది. ఈ పరీక్ష ఉదయం, మధ్యాహ్నం రెండు షిఫ్టుల్లో కంప్యూటర్‌ ఆధారిత ఆన్‌లైన్‌ విధానంలో జరుగనుంది. సీమ్యాట్‌ 2025 స్కోరు ద్వారా 2025-2026 విద్యా సంవత్సరానికి దేశవ్యాప్తంగా దాదాపు వెయ్యి విద్యా సంస్థల్లో మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవచ్చు. డౌన్‌లోడ్‌ చేసుకున్న అడ్మిట్ కార్డ్‌లో అభ్యర్థుల ఫోటో, సంతకం, బార్‌కోడ్ వీటిలో ఏది సరిగా లేకపోయినా.. ఆ అడ్మిట్‌ కార్డు చెల్లుబాటు కాదు. తిరిగి మరోమారు అడ్మిట్‌ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవాలని ఎన్‌టీఏ సూచించింది.

సీమ్యాట్‌ 2025 ప్రవేశ పరీక్ష అడ్మిట్‌ కార్డుల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఎస్ఎస్‌సీ సీజీఎల్‌ టైర్‌2 ప్రాథమిక కీ వచ్చేసింది.. త్వరలోనే ఫలితాలు

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవల్ (సీజీఎల్‌) 2024 టైర్‌-2 పరీక్షకు సంబంధించి ప్రాథమిక ఆన్సర్‌ కీ ని విడుదల చేసింది. పరీక్ష రాసిన అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ ఎంటర్‌ చేసి కీని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కాగా ఎస్సె్స్సీ సీజీఎల్‌ 2024 టైర్‌-2 పరీక్షలు జనవరి 18 నుంచి 20 వరకు జరిగాయి. ఈ పరీక్ష ద్వారా వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లోని గ్రూప్-బి, గ్రూప్-సి విభాగాల్లో మొత్తం 17,727 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

ఎస్ఎస్‌సీ సీజీఎల్‌ టైర్‌2 ప్రాథమిక కీ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఎస్‌ఎస్‌సీ ఎంటీఎస్‌ ఫలితాలు విడుదల.. ఫలితాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

మల్టీ-టాస్కింగ్ స్టాఫ్, హవల్దార్ (MTS) ఎగ్జామ్‌ (టైర్‌-1) 2024 ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) ప్రకటించింది. గత ఏడాది దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో సెప్టెంబర్‌ 30వ తేదీ నుంచి నవంబర్‌ 14వ తేదీ వరకు కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ పద్ధతిలో పరీక్షలు జరిగాయి. ఈ నోటిఫికేషన్‌ కింద వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లో మొత్తం 9,583 మల్టీ-టాస్కింగ్ స్టాఫ్, హవల్దార్ ఖాళీలను భర్తీ చేయనున్నారు.

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (టైర్‌-1) 2024 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.