CLAT Exam 2022: దేశంలోని అగ్రశ్రేణి న్యాయ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (CLAT Exam 2022) తేదీలు ప్రకటించారు. ఈ పరీక్షని జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాల కన్సార్టియం జూన్ 19, 2022న నిర్వహిస్తోంది. ముందుగా ఈ పరీక్షను మే 08న నిర్వహించాల్సి ఉంది. కానీ వాయిదా వేశారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ లో సవరించిన CLAT షెడ్యూల్‌ను తనిఖీ చేయవచ్చు. నమోదు ప్రక్రియ కూడా పొడిగించారు. ఇప్పుడు CLAT పరీక్షకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీ మే 09, 2022. CLAT పరీక్ష UG, PG ప్రోగ్రామ్‌ల కోసం జూన్ 19, 2022న మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు నిర్వహిస్తారు. దేశంలోని 22 జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాలలో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అభ్యసించాలనుకునే అభ్యర్థుల కోసం ఈ పరీక్ష నిర్వహిస్తారు.
CLAT పరీక్ష 2022 పరీక్ష నమూనా..
1. రాత పరీక్ష మల్టిపుల్ చాయిస్ (MCQ) రకంగా ఉంటుంది.
2. యుజి (అండర్ గ్రాడ్యుయేట్) ప్రోగ్రామ్‌కు మొత్తం 200 ప్రశ్నలు, పిజి (పోస్ట్ గ్రాడ్యుయేట్) ప్రోగ్రామ్‌కు 150 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకి ఒక్కో మార్కు.
3. ఇది ఆఫ్‌లైన్ పరీక్ష. దీనికి రెండు గంటల సమయం కేటాయిస్తారు.
4. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కోత విధించాలనే నిబంధన ఉంది.
5. కటాఫ్ నంబర్ ఆధారంగా అభ్యర్థుల మెరిట్ జాబితాను తయారు చేస్తారు.
సబ్జెక్టుల వారీగా మార్కులు
ఈ పరీక్షలో ఇంగ్లిష్ సబ్జెక్టులో 40 మార్కులు, జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్‌లో 50 మార్కులు, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ (న్యూమరికల్ ఎబిలిటీ)లో 20 మార్కులు, లీగల్ ఆప్టిట్యూడ్‌లో 50 మార్కులు, రీజనింగ్ (లాజికల్ రీజనింగ్)లో 40 మార్కులు ఉంటాయి.