CIPET Teaching and Non Teaching Recruitment 2022: భారత ప్రభుత్వ రసాయనాలు, ఎరువుల మంత్రిత్వశాఖకు చెందిన చత్తీస్‌గఢ్‌లోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (CIPET Raipur).. ఒప్పంద ప్రాతిపదికన టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల (teaching jobs) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 9
పోస్టుల వివరాలు: లెక్చరర్, అసిస్టెంట్ లైబ్రేరియన్, ఇన్‌స్ట్రక్టర్ పోస్టులు
విభాగాలు: ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్, ప్లాస్టిక్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, మెకానికల్
పే స్కేల్: నెలకు రూ.20,000ల నుంచి రూ.35,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెసలైజేషన్‌లో యాచిలర్స్ డిగ్రీ (లైబ్రరీ సైన్స్), బీఈ/ బీటెక్/ ఎంఈ/ ఎంటెక్, పీజీ డిప్లొమాలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవంతోపాటు టెక్నికల్ నాలెడ్జ్ కూడా ఉండాలి.
ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
అడ్రస్: డైరెక్టర్ అండ్ హెడ్, ఫ్లాట్ నెం 48, ఇండస్ట్రియల్ ఏరియా, రాయ్‌పూర్-493221, చత్తీస్‌గఢ్.
దరఖాస్తులకు చివరి తేదీ: జూన్ 28, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.