CIPET Recruitment: విజయవాడ సిపెట్‌లో టీచింగ్‌ పోస్టులు.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే అభ్యర్థుల ఎంపిక..

|

Aug 25, 2022 | 7:52 PM

CIPET Recruitment: సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ పెట్రో కెమికల్స్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. విజయవాడ క్యాంపస్‌లో ఉన్న లెక్చరర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. కాంట్రాక్ట్‌ విధానంలో ఈ పోస్టులను రిక్రూట్‌..

CIPET Recruitment: విజయవాడ సిపెట్‌లో టీచింగ్‌ పోస్టులు.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే అభ్యర్థుల ఎంపిక..
Cipet Jobs
Follow us on

CIPET Recruitment: సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ పెట్రో కెమికల్స్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. విజయవాడ క్యాంపస్‌లో ఉన్న లెక్చరర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. కాంట్రాక్ట్‌ విధానంలో ఈ పోస్టులను రిక్రూట్‌ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 05 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో ప్లాస్టిక్స్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ/ మెకానికల్/ కంప్యూటర్ సైన్స్ విభాగంలో 04, ప్లేస్‌మెంట్‌ కన్సల్టెంట్‌ 01 పోస్టులు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దీంతో పాటు సంబంధిత పనిలో అనుభవం తప్పనిసరిగా ఉండాలి.

* అభ్యర్థుల వయసు 65 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తులు అందజేయాల్సి ఉంటుంది.

* దరఖాస్తులను జాయింట్ డైరెక్టర్ & హెడ్, సిపెట్‌, విజయవాడ, సర్వే నంబర్: 377, సూరంపల్లి గ్రామం, గన్నవరం మండలం, విజయవాడ అడ్రస్‌కు రిజిస్టర్డ్/ స్పీడ్ పోస్టు ద్వారా పంపించాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* దరఖాస్తుల స్వీకరణకు 20-09-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి…