CIPET Recruitment: సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రో కెమిక‌ల్స్‌లో ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్షలేకుండానే ఎంపిక..

|

Mar 05, 2022 | 6:30 AM

CIPET Recruitment: సెంట్ర‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రో కెమిక‌ల్స్ ఇంజినీరింగ్ అండ్‌ టెక్నాలజీ (CIPET)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భువనేశ్వర్‌లోని ఈ సంస్థలో పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌లో భాగంగా జూనియర్ రీసెర్చ్‌ ఫెలో, ప్రాజెక్ట్ అసోసియేట్‌, ప్రాజెక్ట్ అసిస్టెంట్‌...

CIPET Recruitment: సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రో కెమిక‌ల్స్‌లో ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్షలేకుండానే ఎంపిక..
Cipet Jobs
Follow us on

CIPET Recruitment: సెంట్ర‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రో కెమిక‌ల్స్ ఇంజినీరింగ్ అండ్‌ టెక్నాలజీ (CIPET)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భువనేశ్వర్‌లోని ఈ సంస్థలో పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌లో భాగంగా జూనియర్ రీసెర్చ్‌ ఫెలో, ప్రాజెక్ట్ అసోసియేట్‌, ప్రాజెక్ట్ అసిస్టెంట్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 05 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో (జేఆర్‌ఎఫ్‌)–02, ప్రాజెక్ట్‌ అసోసియేట్‌–02, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌లు–01 ఖాళీలు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్‌/డిప్లొమా, ఎంఈ/ఎంటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. నెట్‌/గేట్‌ అర్హతతోపాటు సంబంధిత పనిలో అనుభవం తప్పనిసరిగా ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* దరఖాస్తులను ది ఇంచార్జ్‌–అడ్మినిస్ట్రేషన్, సీపెట్‌: ఎస్‌ఏఆర్‌పీ–ఎల్‌ఏఆర్‌పీఎం, బీ–25, సీఎన్‌ఐ కాంప్లెక్స్, పాటియా, భువనేశ్వర్‌–751024, ఒడిశా అడ్రస్‌కు పంపించాలి.

* అభ్యర్థులను మొదట అకడమిక్‌ అర్హత ఉధారంగా షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. అనంతరం ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

* జేఆర్‌ఎఫ్,ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ పోస్టులకు నెలకు రూ.31,000తో పాటు హెచ్‌ఆర్‌ఏ, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ పోస్టులకు నెలకు రూ.20,000 జీతంగా చెల్లిస్తారు.

* దరఖాస్తుల స్వీకరణకు 14-03-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: World Hearing Day 2022: ఎంతమంది వినికిడి సమస్యలతో బాధపడుతున్నారో తెలుసా? ఈ ఇబ్బందిని అసలు అశ్రద్ధ చేయవద్దు..

Knowledge: పూర్తి మద్యపాన నిషేధమున్న రాష్ట్రాల్లోకి మద్యం బాటిల్స్ తీసుకెళ్లొచ్చా? అక్కడ మద్యం సేవించవచ్చా? ఆసక్తికర విషయాలు..

AIIMS Jobs 2022: ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ఫ్యాకల్టీ పోస్టులు.. నెలకు 2 లక్షలకు పైగా జీతంతో..