CCIL Recruitment 2021: సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సీసీఐఎల్) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఈ సంస్థలో మొత్తం 46 పోస్టులను భర్తీ చేయనున్నారు. కాంట్రాక్ట్ విధానంలో ఉద్యోగులను భర్తీ చేయనున్న నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..
* నోటిఫికేషన్‌లో భాగంగా ప్రొడక్షన్, మెకానికల్, సివిల్, మైనింగ్, ఇన్‌స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్, మెటీరియల్ మేనేజ్‌మెంట్, మార్కెటింగ్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, హ్యూమన్ రిసోర్స్, కంపెనీ సెక్రెటరీ, రాజ్‌భాష అధికారి, లీగల్ పోస్టులు భర్తీ చేయనున్నారు.
* ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు.. ఇంజినీరింగ్, డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి.
* మొత్తం 46 ఖాళీలకు గాను ఇంజినీర్ (29), ఆఫీసర్ (17) పోస్టులున్నాయి.
* ఎంపికైన అభ్యర్థులు తాండూర్, బొకజాన్, రాజ్‌బన్, కార్పొరేట్ ఆఫీస్‌లలో పనిచేయాల్సి ఉంటుంది.
* అభ్యర్థుల వయసు 35 ఏళ్లు మించకూడదు.
* ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* దరఖాస్తులకు చివరి తేదీగా 30-06-2021 నిర్ణయించారు.
* పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి..
Covid Third Wave: దడ పుట్టిస్తున్నకొవిడ్ థర్డ్ వేవ్ ‘గండం’… పసిమొగ్గలను కాపాడుకోవడం ఎలా?