APPSC 2024 Certificate Verification Dates: ధ్రువపత్రాల పరిశీలన తేదీల‌ను వెల్లడించిన ఏపీపీఎస్సీ.. ఏయే పోస్టులకంటే!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ విభాగాల్లో వివిధ ఉద్యోగ నియామకాలకు ఎంపిక చేసిన అభ్యర్థులకు సంబంధించిన ధ్రువపత్రాల పరిశీలన తేదీలు విడుదలయ్యాయి. వీరందరికీ జులై 23 నుంచి 25వ తేదీ వరకు విజయవాడలోని ఏపీపీఎస్సీ ఆఫీస్‌లో ధ్రువపత్రాల పరిశీలన నిర్వహిస్తారు. ఆయుర్వేద మెడికల్‌ ఆఫీసర్లుగా ఎంపికయిన అభ్యర్ధులకు ఆయా తేదీల్లో ఈ ప్రక్రియను నిర్వహించనున్నారు..

APPSC 2024 Certificate Verification Dates: ధ్రువపత్రాల పరిశీలన తేదీల‌ను వెల్లడించిన ఏపీపీఎస్సీ.. ఏయే పోస్టులకంటే!
APPSC Dates

Updated on: Jul 05, 2024 | 3:24 PM

అమరావతి, జులై 5: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ విభాగాల్లో వివిధ ఉద్యోగ నియామకాలకు ఎంపిక చేసిన అభ్యర్థులకు సంబంధించిన ధ్రువపత్రాల పరిశీలన తేదీలు విడుదలయ్యాయి. వీరందరికీ జులై 23 నుంచి 25వ తేదీ వరకు విజయవాడలోని ఏపీపీఎస్సీ ఆఫీస్‌లో ధ్రువపత్రాల పరిశీలన నిర్వహిస్తారు. ఆయుర్వేద మెడికల్‌ ఆఫీసర్లుగా ఎంపికయిన అభ్యర్ధులకు ఆయా తేదీల్లో ఈ ప్రక్రియను నిర్వహించనున్నారు. హోమియో మెడికల్‌ ఆఫీసర్ల ఉద్యోగాలకు ఎంపికయిన వారికీ కూడా ఇవే తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుంది. ఈ మేరకు అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు.

అలాగే ఫుడ్‌సేఫ్టీ ఆఫీసర్ల ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్ధుల జాబితాను కూడా ఏపీపీఎస్సీ వెల్లడించింది. పుడ్‌ డిపార్టుమెంట్‌-వైద్య ఆరోగ్యశాఖకు సంబంధించి శాంపిల్‌ టేకర్‌ ఉద్యోగాల భర్తీకి ప్రాథమికంగా ఎంపిక చేసిన అభ్యర్థులకు జులై 12వ తేదీన ధ్రువపత్రాల పరిశీలన ఏపీపీఎస్సీ కార్యాలయంలో నిర్వహిస్తారు. ఈ మేరకు ఏపీపీఎస్సీ సెక్రటరీ ప్రదీప్‌కుమార్‌ తన ప్రకటనలో తెలిపారు. ఈ పోస్టులతోపాటు ఫారెస్ట్‌ రేంజి ఆఫీసర్స్‌ ఉద్యోగాల నియామకాలకు సంబంధించి ప్రాథమికంగా ఎంపిక చేసిన అభ్యర్థుల సెలక్షన్‌ లిస్ట్‌ను కూడా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు ఏపీపీఎస్సీ పేర్కొంది.

టీజీపీఎస్సీ వార్డెన్‌ పోస్టులకు ప్రశాంతంగా ముగిసిన రాత పరీక్ష

తెలంగాణ రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల్లో వసతిగృహ సంక్షేమాధికారి పోస్టులకు జూన్‌ 24 నుంచి 29 వరకు సీబీఆర్‌టీ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు 56.94 శాతం మంది హాజరైనట్లు జీపీఎస్సీ జులై 4న ఓ ప్రకటనలో తెలిపింది. ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1.45 లక్షల మంది దరఖాస్తు చేయగా, వీరిలో కేవలం 82,873 మంది మాత్రమే పరీక్షలకు హాజరైనట్లు కమిషన్‌ పేర్కొంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళాశిశు సంక్షేమశాఖల పరిధిలోని వసతి గృహాల్లో మొత్తం 562 అధికారులు, పిల్లల సంరక్షణ గృహాల్లో 19 మహిళా సూపరింటెండెంట్‌ పోస్టుల భర్తీకి ఈ నియమాక ప్రక్రియ చేపట్టిన సంగతి తెలిసిందే. మరోవైపు డివిజనల్‌ ఎకౌంట్స్‌ అధికారుల (డీఏవో) పోస్టులకు 1.06 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. వీరికి జూన్‌ 30 నుంచి జులై 4 వరకు ఆన్‌లైన్‌ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షకు కూడా భారీగా అభ్యర్ధులు డుమ్మా కొట్టారు. కేవలం 33.72 శాతం మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారని కమిషన్‌ తెలిపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us