
హైదరాబాద్, నవంబర్ 7: తెలంగాణ జూనియర్ పంచాయతీ కార్యదర్శి పోస్టులకు సంబంధించిన కీలక అప్‌డేట్‌ను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. స్పోర్ట్స్ కోటా కింద భర్తీ చేయనున్న పోస్లుకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ నవంబర్ 10, 11 తేదీల్లో ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఖైరతాబాద్‌లోని కమిషన్ కార్యాలయంలో ఆయా తేదీత్లో నిర్వహించనుంది. ఈ మేరకు సంబంధిత వివరాలతో ప్రకటన జారీ చేసింది. పంచాయతీ కార్యదర్శుల ఎంపికలో భాగంగా ఈ రెండు రోజుల పాటు సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు పంచాయతీరాజ్ శాఖ వెల్లడించింది.
సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు హాజరయ్యే అభ్యర్ధులు తమతోపాటు రాత పరీక్ష హాల్ టికెట్, పదో తరగతి, ఇంటర్, డిగ్రీల సర్టిఫికెట్లు, ఒకటో తరగతి నుంచి 7వ తరగతి చదివినట్లు ధ్రువీకరించే లోకల్ సర్టిఫికెట్, ప్రభుత్వ ఉద్యోగులైతే నో అబ్జక్షన్ సర్టిఫికెట్.. సర్వీస్ సర్టిఫికెట్లు, స్పోర్ట్స్ సర్టిఫికెట్, ఆధార్ కార్డులు తీసుకెళ్లాలి. ఒరిజినల్ పత్రాలతోపాటు జిరాక్స్ సెట్లు కూడా తమతోపాటు తీసుకెళ్లవల్సి ఉంటుంది. ఈ మేరకు అభ్యర్ధులకు సూచనలు జారీచేస్తూ ప్రకటనలో పేర్కొంది.
కాగా 2019లో కోర్టు వివాదాల నేపథ్యంలో స్పోర్ట్స్ కోటాలో ఎంపికైన అభ్యర్థులను తొలగించిన విషయం తెలిసిందే. ఇప్పడు వారితో పాటు కొత్తగా ఎంపికైన 172 మందికి కూడా సర్టిఫికేట్లను పరిశీలించనున్నారు. ఈ మేరకు అభ్యర్ధులు గమనించవల్సి ఉంది.
తెలంగాణ జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.