AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AI పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. బడి పిల్లల కరిక్యులమ్‌లో సరికొత్త మార్పులు!

AI in School Curriculum: ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ సర్వాంతర్యామిగా మారుతున్న క్రమంలో కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే అన్ని రంగాల్లో ఏఐ రంగ ప్రవేశం చేసింది. ఇప్పుడు విద్యారంగంలోనూ పెను మార్పులకు తెరదించింది. ఈ క్రమంలో 2026-27 విద్యా సంవత్సరం నుంచి మూడో తరగతి నుంచే..

AI పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. బడి పిల్లల కరిక్యులమ్‌లో సరికొత్త మార్పులు!
AI in School Curriculum
Srilakshmi C
|

Updated on: Oct 11, 2025 | 7:10 AM

Share

న్యూఢిల్లీ, అక్టోబర్‌ 11: ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ సర్వాంతర్యామిగా  పరిణమిస్తున్న క్రమంలో కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే అన్ని రంగాల్లో ఏఐ రంగ ప్రవేశం చేసింది. ఇప్పుడు విద్యారంగంలోనూ పెను మార్పులకు తెరదించింది. ఈ క్రమంలో 2026-27 విద్యా సంవత్సరం నుంచి మూడో తరగతి నుంచే అన్ని పాఠశాలల కరిక్యులమ్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ని ప్రవేశపెట్టాలని కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఇక అన్ని తరగతుల విద్యార్థుల కోసం ఏఐ ఇంటిగ్రేషన్‌ ఫ్రేమ్‌ వర్క్‌ను కేంద్రం అభివృద్ధి చేయనుంది.

వచ్చే రెండు మూడేళ్లలో విద్యార్థులు, టీచర్లు సమన్వయం చేసుకునేలా వేగంగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. దేశవ్యాప్తంగా సుమారు కోటి మందికిపైగా టీచర్లకు ఏఐ టెక్నాలజీ విద్యపై దిశానిర్దేశం చేయడం సవాలుగా మారింది. అన్ని తరగతుల్లో AI ఏకీకరణకు సీబీఎస్‌ఈ ప్రేమ్‌ వర్క్‌ను అభివృద్ధి చేస్తోంది. పాఠ్య ప్రణాళికలను సిద్ధం చేయడానికి ఉపాధ్యాయులు AI టూల్స్‌ ఉపయోగించేందుకు ఒక పైలట్ ప్రాజెక్ట్ ఇప్పటికే చేపట్టాం. డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు అనుగుణంగా విద్యార్ధులను, ఉపాధ్యాయులను సిద్ధం చేయడమే మా లక్ష్యమని కేంద్ర స్కూల్‌ ఎడ్యుకేషన్‌ కార్యదర్శి సంజయ్‌ కుమార్‌ పేర్కొన్నారు.

ఇప్పటికే 18, 000 కి పైగా CBSE పాఠశాలలు 6వ తరగతి నుంచే 15 గంటల మాడ్యూల్‌లో AI ని స్కిల్‌ సబ్జెక్టుగా అందిస్తున్నాయి. ఇక 9 నుంచి 12 తరగతులు దీనిని ఐచ్ఛిక సబ్జెక్టుగా అందిస్తున్నాయి. ఏఐతో ఉద్యోగాల తొలగింపుపై NITI ఆయోగ్ నివేదికను విడుదల చేస్తూ కుమార్ ఈ విషయాలను వెల్లడించారు. ఇది సుమారు 20 లక్షల సాంప్రదాయ ఉద్యోగాలను తొలగించవచ్చని, కానీ సరైన పర్యావరణ వ్యవస్థను సృష్టిస్తే ఎనిమిది మిలియన్ల కొత్త ఉద్యోగాలు సృష్టించవచ్చని ఆయన పేర్కొన్నారు. AI ఆర్థిక వ్యవస్థలో భారత్‌ భవిష్యత్తు నిర్ణయాత్మక చర్యపై ఆధారపడి ఉంది. ప్రభుత్వం, పరిశ్రమ, విద్యాసంస్థలలో సమన్వయ నాయకత్వంతో భారత్ తన శ్రామిక శక్తిని కాపాడుకోవడమే కాకుండా ప్రపంచ AIని రూపొందించడంలో కూడా ముందుండగలదని ఈ నివేదిక పేర్కొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.