Jobs in Qatar: ఏపీ నిరుద్యోగులకు భలేఛాన్స్.. ఖతార్‌లో ఉద్యోగాలకు విజయవాడలో ఇంటర్వ్యూలు! ఏ తేదీనంటే..
నిరుద్యోగులకు సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఖతార్ దేశంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. అక్టోబరు 13న విజయవాడలో ఈ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ ఓ ప్రకటనలో తెలిపారు. అర్హత, ఆసక్తి కలిగిన..

అమరావతి, అక్టోబర్ 11: రాష్ట్రంలోని నిరుద్యోగులకు సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఖతార్ దేశంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. అక్టోబరు 13న విజయవాడలో ఈ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ ఓ ప్రకటనలో తెలిపారు. అర్హత, ఆసక్తి కలిగిన మైనారిటీ యువత దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ ఇంటర్వ్యూ ద్వారా హోమ్ కేర్ నర్స్ ఉద్యోగాలు అందించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తన ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన నిరుద్యోగులు అక్టోబరు 12, 2025వ తేదీలోగా ఆన్‌లైన్ విధానంలో అధికారిక వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.
మెగా డీఎస్సీ కొత్త టీచర్లకు మాన్యువల్ కౌన్సెలింగ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల పూర్తి చేసిన మెగా డీఎస్సీ నియామకాల్లో ఎంపికైన టీచర్లకు పాఠశాల విద్యాశాఖ మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించనుంది. కర్నూలు, చిత్తూరులాంటి జిల్లాల్లో ఎస్జీటీ పోస్టులు అధికంగా ఉండడంతో మాన్యువల్ కౌన్సెలింగ్‌ను అక్టోబరు 9న సాయంత్రం నుంచి చేపట్టింది. ఇక పాఠశాలల కేటాయింపు ప్రక్రియ అక్టోబరు 11వ తేదీలోపు పూర్తి చేయనుంది. అక్టోబరు 13 నుంచి కొత్త టీచర్లు తమకు కేటాయిచిన పాఠశాలల్లో విధులకు హాజరయ్యేలా వెళ్లేలా పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తుంది.
త్వరలో టీజీపీఎస్సీ గ్రూప్ 3 పోస్టులకు ధ్రువపత్రాల పరిశీలన
తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 1,365 గ్రూప్ 3 సర్వీసు పోస్టులకు నియామక ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. పోస్టుల భర్తీకి ఇప్పటికే 1:3 నిష్పత్తిలో అభ్యర్థుల నుంచి వెబ్‌ఆప్షన్లను స్వీకరించింది. ఈ మేరకు ప్రాధాన్యత క్రమంలో పోస్టులకు వెబ్‌ఆప్షన్లు నమోదు చేసుకునేందుకు సెప్టెంబరు 30 నుంచి అక్టోబరు 10 సాయంత్రం 5.30 గంటల వరకు అవకాశం కల్పించింది. వెట్అప్షన్ల అనంతరం ధ్రువీకరణ పత్రాల పరిశీలన నిర్వహించి పోస్టింగులు ఇచ్చేందుకు కమిషన్ ఏర్పాట్లు చేస్తుంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.




