భారత ప్రభుత్వ బొగ్గు గనుల మంత్రిత్వశాఖకు చెందిన కోల్ ఇండియా లిమిటెడ్‌కు చెందిన సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్.. 330 మైనింగ్ సర్దార్, ఎలక్ట్రీషియన్ (నాన్ ఎగ్జిక్యూటివ్) టెక్నీషియన్, డిప్యూటీ సర్వేయర్, అసిస్టెంట్ ఫోర్‌మేన్ (ఎలక్ట్రికల్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి పదో తరగతిలో ఉత్తీర్ణతతోపాటు, మైనింగ్ సర్దార్ సర్టిఫికెట్/గ్యాస్ టెస్టింగ్ సర్టిఫికెట్/ఎలక్ట్రీషియన్ ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికెట్/మైన్స్ సర్వే సర్టిఫికెట్ ఆఫ్ కాంపిటెన్సీ/ఓవర్‌మ్యాన్స్ సర్టిఫికెట్ ఆఫ్ కాంపిటెన్సీ/గ్యాస్ టెస్టింగ్ సర్టిఫికెట్/ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్/ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా ఉండాలి. అభ్యర్థుల వయసు ఏప్రిల్ 19, 2023వ తేదీ నాటికి 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానంలో ఏప్రిల్ 19, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులు రూ.200లు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/ఎక్స్ సర్వీస్‌మెన్/వికలాంగ/మహిళా అభ్యర్థులు ఫీజు చెల్లించనవసరం లేదు. రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. రాత పరీక్ష మే 5వ తేదీన నిర్వహిస్తారు. ఫలితాలు మే 29న ప్రకటిస్తారు. ఎంపికైన వారికి నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా జీతభత్యాలు చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.