Central Bank of India Jobs: పదో తరగతి అర్హతతో సెంట్రల్ బ్యాంకులో 484 ఉద్యోగాలు.. ఎలా ఎంపిక చేస్తారంటే..

కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ముంబయిలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోని హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌.. దేశ వ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖల్లో.. సఫాయి కర్మచారి కమ్ సబ్-స్టాఫ్, సబ్-స్టాఫ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పదో తరగతి అర్హతతో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 484 సఫాయి కర్మచారి కమ్ సబ్-స్టాఫ్, సబ్-స్టాఫ్ పోస్టులను..

Central Bank of India Jobs: పదో తరగతి అర్హతతో సెంట్రల్ బ్యాంకులో 484 ఉద్యోగాలు.. ఎలా ఎంపిక చేస్తారంటే..
Central Bank Of India

Edited By:

Updated on: Jan 12, 2024 | 9:00 AM

కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ముంబయిలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోని హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌.. దేశ వ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖల్లో.. సఫాయి కర్మచారి కమ్ సబ్-స్టాఫ్, సబ్-స్టాఫ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పదో తరగతి అర్హతతో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 484 సఫాయి కర్మచారి కమ్ సబ్-స్టాఫ్, సబ్-స్టాఫ్ పోస్టులను ఈ నోటిఫికేషన్‌ కింద ఫిల్‌ చేస్తారు. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో జనవరి 16 వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుదారుల వయసు మార్చి 31, 2023 నాటికి 18 నుంచి 26 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు అయిదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. దరఖాస్తు రుసుము కింద ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈఎస్‌ఎం అభ్యర్థులకు రూ.175, జనరల్‌ అభ్యర్ధులు రూ.850 వరకు చెల్లించవల్సి ఉంటుంది.

ఎంపిక విధానం ఇలా..

ఆన్‌లైన్‌ రాత పరీక్ష, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్ పరీక్ష 70 మార్కులకు, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ 30 మార్కులకు ఉంటుంది. ఆన్‌లైన్ పరీక్ష ఆంగ్ల మాధ్యమంలో మాత్రమే ఉంటుంది. ఆబ్జెక్టివ్‌ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. ఇంగ్లిష్ లాంగ్వేజ్‌, జనరల్‌ అవేర్‌నెస్‌, ఎలిమెంటరీ అరిథ్‌మెటిక్‌, రీజనింగ్ విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.

ఇవి కూడా చదవండి

జోన్ల వారీగా ఖాళీల వివరాలు..

  • అహ్మదాబాద్ జోన్‌లో ఖాళీల సంఖ్య: 76
  • భోపాల్ జోన్‌లో ఖాళీల సంఖ్య: 38
  • ఢిల్లీ జోన్‌లో ఖాళీల సంఖ్య: 76
  • కోల్‌కతా జోన్‌లో ఖాళీల సంఖ్య: 2
  • లక్నో జోన్‌లో ఖాళీల సంఖ్య: 78
  • ఎంఎంజడ్‌వో అండ్‌ పుణె జోన్‌లో ఖాళీల సంఖ్య: 118
  • పట్నా జోన్‌లో ఖాళీల సంఖ్య: 96.

ముఖ్యమైన తేదీలు ఇవే..

  • ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ: డిసెంబర్ 20, 2023.
  • ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: జనవరి 16, 2024.
  • ప్రీ ఎగ్జామ్‌ ట్రైనింగ్‌ ఎగ్జామ్‌ కాల్ లెటర్‌ డౌన్‌లోడ్ తేదీ: జనవరి 2024 నుంచి
  • ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్: జనవరి 2024 నుంచి
  • ఆన్‌లైన్ పరీక్ష కాల్ లెటర్‌ డౌన్‌లోడ్ తేదీ: జనవరి/ ఫిబ్రవరి 2024 నుంచి
  • ఆన్‌లైన్ రాత పరీక్ష తేదీ: ఫిబ్రవరి 2024.
  • పరీక్ష ఫలితాల వెల్లడి తేదీ: ఫిబ్రవరి 2024.
  • లోకల్‌ లాంగ్వేజ్‌ టెస్ట్‌ కాల్ లెటర్‌ డౌన్‌లోడ్‌ తేదీ: మార్చి 2024 నుంచి
  • జోన్ల వారీగా లోకల్‌ లాంగ్వేజ్‌ టెస్ట్‌: మార్చి 2024.
  • ప్రొవిజనల్‌ సెలెక్షన్‌ విడుదల తేదీ: ఏప్రిల్ 2024.

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us