Jobs in Hyderabad 2022: బీటెక్ నిరుద్యోగులకు బంపరాఫర్‌! హైదరాబాద్‌ సీడ్యాక్‌లో భారీగా ఉద్యోగాలు..

భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్పర్మేషన్‌ టెక్నీలజీ మంత్రిత్వశాఖకు చెందిన సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌ (CDAC).. హైదరాబాద్‌లో అడ్జంక్ట్‌ ఇంజినీర్ (Adjunct Engineer Posts) పోస్టుల భర్తీకి అర్హులైన..

Jobs in Hyderabad 2022: బీటెక్ నిరుద్యోగులకు బంపరాఫర్‌! హైదరాబాద్‌ సీడ్యాక్‌లో భారీగా ఉద్యోగాలు..
Cdac

Updated on: Jul 13, 2022 | 9:09 PM

CDAC Adjunct Engineer Recruitment 2022: భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్పర్మేషన్‌ టెక్నీలజీ మంత్రిత్వశాఖకు చెందిన సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌ (CDAC).. హైదరాబాద్‌లో అడ్జంక్ట్‌ ఇంజినీర్ (Adjunct Engineer Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఎంపికైన అభ్యర్ధులు ముంబయి, జమ్మూ, దిల్లీ, పుణె, బెంగళూరు, హైదరాబాద్‌, చెన్నైలలో పనిచేయవల్సి ఉంటుంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

ఖాళీల సంఖ్య: 104

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు: సాఫ్ట్‌వేర్‌ ఆర్కిటెక్ట్‌, ప్రాజెక్ట్‌ మేనేజర్లు, సీనియర్‌ డెవలపర్‌, డేటా సెంటర్‌ మేనేజర్‌, టెక్నికల్‌ లీడ్‌, డేటా సైంటిస్టులు, ఐటీ సర్వీస్‌ డిజైన్‌ ఆర్కిటెక్ట్‌, బిజినెస్‌ అనలిస్ట్‌ తదితర పోస్టులు

విభాగాలు: సైబర్‌ సెక్యూరిటీ, క్లౌడ్‌ సర్వీసెస్‌, ఐఓటీ టెక్నాలజీస్‌, మొబైల్‌ సెక్యూరిటీ, వీఎల్‌ఎస్‌ఐ డిజైన్‌ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 57 ఏళ్లకు మించరాదు.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్లో బీఈ/బీటెక్‌/ఎంసీఏ/పీజీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. టెక్నికల్‌ నైపుణ్యాలు అవసరం.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌/ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తులకు చివరి తేదీలు: జులై 18, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.