CBSE Admit Card: కరోనా తదనంతర పరిస్థితుల నేపథ్యంలో విద్యా వ్యవస్థలో కీలక మార్పులు జరిగిన విషయం తెలిసిందే. విద్యార్థుల మీద ఒత్తిడి తగ్గించే క్రమంలోనే ఇప్పటికే పలు రాష్ట్రాలు పరీక్షా విధానంలో మార్పులు చేర్పులు చేశాయి. ఈ క్రమంలోనే సీబీఎస్‌ఈ కూడా పలు మార్పులు చేసింది. వచ్చే ఏడాది జరగబోయే పరీక్షలకు సంబంధించి మంగళవారం (నవంబర్ 9) బోర్డు కీలక ప్రకటన చేయనుంది. ఇందులో భాగంగా 2022లో జరగబోయే టర్మ్ 1 పరీక్షల అడ్మిట్ కార్డులను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో పెట్టనున్నారు. విద్యర్థులు తమ టర్మ్ 1 అడ్మిట్ కార్డులను cbse.nic.in లేదా cbse.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
టర్మ్ 1 పరీక్షల్లో భాగంగా 10 మైనర్ పేపర్స్ నవంబర్ 17న ప్రారంభమవుతుండగా.. 12వ తరగతి పరీక్షలు నవంబర్ 16 నుంచి ప్రారంభమవనున్నాయి. ఇక 10వ తరగతి మేజర్ పరీక్షలు నవంబర్ 30 నుంచి, 12వ తరగతి మేజర్ పేపర్స్ డిసెంబర్ 1 నుంచి మొదలుకానున్నాయి. ఇదిలా ఉంటే సీబీఎస్‌ఈ 12వ తరగతిలో 114 సబ్జెక్టులు ఉండగా వీటిలో 19 మేజర్ సబ్జెక్ట్స్, మిగితావన్నీ మైనర్ సబ్జెక్టులు ఉండనున్నాయి. ఇక 10వ తరగతి విషయానికొస్తే 75 సబ్జెక్టుల్లో 9 మేజర్ సబ్జెక్ట్స్ ఉండగా, మిగితావి మైనర్ సబ్జెక్ట్‌లు.
ఇక టర్మ్ 1 పరీక్ష విధానంలో మల్టీపుల్ చాయిస్ రూపంలో ప్రశ్నాపత్రం ఉండనుంది. పరీక్ష సమయం 90 నిమిషాలు ఉండనుంది. ఇక మంగళవారం సీబీఎస్‌ఈ బోర్డు.. అడ్మిట్ కార్డులతో పాటు 2022లో జరగబోయే టర్మ్ 1 పరీక్షా పత్రానికి సంబంధించిన నమూన ఓఎమ్‌ఆర్ షీట్లను సైతం విద్యార్థులకు అందుబాటులో ఉంచనున్నారు.
CM KCR: “ఆ పథకానికి రూపాయి ఇచ్చినట్టు నిరూపిస్తే.. సీఎం పదవికి రాజీనామా చేస్తా”
CM KCR: “ఆ పథకానికి రూపాయి ఇచ్చినట్టు నిరూపిస్తే.. సీఎం పదవికి రాజీనామా చేస్తా”