CBSE Exam: 10, 12వ తరగతుల టర్మ్ 2 పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసిన సీబీఎస్‌ఈ.. పూర్తి వివరాలు..

CBSE Exam: 10, 12వ తరగతుల టర్మ్‌-2 పరీక్షల షెడ్యూల్‌ను తాజాగా సీబీఎస్‌ఈ బోర్డు విడుదల చేసింది. ఇప్పటికే టర్మ్‌-1 పరీక్షలను నిర్వహించిన బోర్డు తాజాగా టర్మ్‌2 పరీక్షలను నిర్వహించేందుకు సిద్ధమైంది. కరోనా (Corona) మహమ్మారి కారణంగా...

CBSE Exam: 10, 12వ తరగతుల టర్మ్ 2 పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసిన సీబీఎస్‌ఈ.. పూర్తి వివరాలు..
Inter Exams

Updated on: Mar 11, 2022 | 5:19 PM

CBSE Exam: 10, 12వ తరగతుల టర్మ్‌-2 పరీక్షల షెడ్యూల్‌ను తాజాగా సీబీఎస్‌ఈ బోర్డు విడుదల చేసింది. ఇప్పటికే టర్మ్‌-1 పరీక్షలను నిర్వహించిన బోర్డు తాజాగా టర్మ్‌2 పరీక్షలను నిర్వహించేందుకు సిద్ధమైంది. కరోనా (Corona) మహమ్మారి కారణంగా పరీక్షల నిర్వహణలో జాప్యం కావడంతో సీబీఎస్‌ఈ బోర్డ్‌ ఈ సారి రెండు విడతలుగా పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టర్మ్‌ 2 థియరీ పరీక్షలు ఏప్రిల్‌ 26 నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 10.30 గంటలకు పరీక్షలను నిర్వహించనున్నారు. పరీక్షలన్నీ ఆఫ్‌లైన్‌ విధానంలో జరగనున్నట్లు బోర్డ్‌ ఎగ్జామినేషన్‌ కంట్రోలర్‌ సన్యం భరద్వాజ్‌ ఇప్పటికే స్పష్టం చేశారు. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో అధికారులు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.

ఈ పరీక్షల షెడ్యూల్‌ను రూపొందించే సమయంలో జేఈఈ మెయిన్‌తో సహా ఇతర పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకున్నట్లు బోర్డు జారీ చేసిన సర్క్యూలర్‌లో తెలిపింది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో రెండు టర్మ్‌ పరీక్షలకు మధ్య చాలా గ్యాప్‌ ఇచ్చినట్లు సీబీఎస్‌ఈ బోర్డు తెలిపింది. సీబీఎస్‌ఈ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచిన శాంపిల్‌ ప్రశ్నా పత్రాల్లాగే పరీక్షల ప్రశ్నాపత్రాలు ఉంటాయని సీబీఎస్‌ఈ తెలిపింది. పరీక్షల పూర్తి షెడ్యూల్‌ను కింద చూడండి.

ఇదిలా ఉంటే సీబీఎస్‌ఈ టర్మ్‌ 1, 12వ తరగతి పరీక్ష ఫలితాలు శుక్రవారం విడుదల కానున్నాయని ఓ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే దీనిపై బోర్డు అధికారికంగా స్పందించింది. సీబీఎస్‌ఈ బోర్డ్‌ పేరుతో జరుగుతోన్న తప్పుడు ప్రచారాన్ని ఎవ్వరూ నమ్మొద్దని, ఏదైనా అధికారిక సమాచారం ఉంటే వెబ్‌సైట్‌లో ఉంటుందని స్పష్టతనిచ్చింది.

Also Read: Samantha: ఆ పాటతోనే నన్ను గుర్తుపెట్టుకుంటున్నారు.. సమంత ఆసక్తికర వ్యాఖ్యలు..

డైనమిక్ లుక్ లో స్టైలిష్ హీరో.. అమ్మాయిల రాజకుమారుడు గా ఆది

రోజు రోజుకి గ్లామర్ డోస్ పెంచుతున్న హీరోయిన్ పాయల్