CBSE Class 10th Result: సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) పరీక్ష ఫలితాలు మంగళవారం 12 గంటలకు విడుదలయ్యాయి. అయితే కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది కూడా సీబీఎస్‌ఈ 10,12 తరగతి పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. గతవారం 12వ తరగతి ఫలితాలు విడుదల చేయగా, రికార్డు స్థాయిలో 99.37 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అయితే వాస్తవానికి పదో తరగతి ఫలితాలు జులై 20న విడుదల చేయాల్సి ఉండగా, పాఠశాలల నుంచి మార్కుల జాబితా పంపడంలో ఆలస్యం కావడంతో ఫలితాల విడుదల కూడా వాయిదా పడింది. తాజాగా ఈ ఫలితాలను బోర్డు విడుదల చేసింది.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలైన నేపథ్యంలో విద్యార్థులు ఫలితాలు అధికారి వెబ్‌సైట్‌లో పొందుపరుస్తున్నట్లు సీబీఎస్‌ఈ బోర్డు తెలిపింది. ఫలితాల కోసం cbseresults.nic.inలో చూసుకోవచ్చు. అలాగే cbse.gov.in, cbse.nic.inలో కూడా ఫలితాలను చూసుకోవచ్చు. ఫలితాల మార్క్ షిట్‌లు, సర్టిఫికేట్‌లను యాక్సెస్ చేసుకోవచ్చు. మూల్యాంకన ప్రకారం.. ఇంటర్నల్ అసెస్‌మెంట్‌లు, అర్ధ సంవత్సరం లేదా మధ్యంతర పరీక్షలు, ప్రీ-బోర్డ్ పరీక్షలలో విద్యార్థుల పనితీరును బట్టి మార్కులు కేటాయించారు.