CAT Registration 2021: CAT పరీక్షకు అప్లై చేసుకోవడానికి ఈ రోజు చివరితేది. అర్హులైన అభ్యర్థులు ఎవరైనా ఉంటే అధికారిక వెబ్‌సైట్ iimcat.ac.in ని సందర్శించి దరఖాస్తు చేసుకోవచ్చు. దేశంలోని టాప్ మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌లలో ప్రవేశాల కోసం ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఈ రోజు సాయంత్రం 5గంటల వకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఈ సంవత్సరం కామన్ అడ్మిషన్ టెస్ట్ పరీక్షకి హాజరు కావాలనుకునే అభ్యర్థులందరూ iimcat.ac.in వెబ్‌సైట్‌ని తప్పకుండా సందర్శించాలి. దరఖాస్తు చేయడానికి ముందు అధికారిక వెబ్‌సైట్‌లో ఉన్న నోటిఫికేషన్‌ను ఒక్కసారి పరిశీలించాలి. గత సంవత్సరం కరోనా కారణంగా చాలా మంది ఐఐఎంలు ఆన్‌లైన్ ఇంటర్వ్యూలను నిర్వహించాయి.
ఇలా నమోదు చేసుకోండి
1. నమోదు కోసం మొదట అధికారిక వెబ్‌సైట్ iimcat.ac.in కి వెళ్లండి.
2. వెబ్‌సైట్‌లో ఇచ్చిన రిజిస్టర్ లింక్‌పై క్లిక్ చేయండి.
3. తరువాత మీ పేరు, తండ్రి పేరు, మొబైల్, ఇమెయిల్ ఇతర సమాచారాన్ని నింపండి.
4. లాగిన్ అయి మీ దరఖాస్తు ఫారమ్ నింపండి.
5. ఫోటో అప్‌లోడ్ చేసి సంతకం చేయండి.
6. ఆ తర్వాత అప్లికేషన్ ఫీజు సమర్పించండి.
7. మొత్తం ప్రక్రియ పూర్తయిన తర్వాత అప్లికేషన్ ప్రింట్ తీసుకోండి.
అడ్మిట్ కార్డు
క్యాట్ అడ్మిట్ కార్డ్ అక్టోబర్ 27న అధికారిక వెబ్‌సైట్‌లో విద్యార్థులకు అందుబాటులో ఉంటుంది. మీరు క్యాట్ వెబ్‌సైట్ సందర్శించి హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. నోటిఫికేషన్ ప్రకారం.. 2022 జనవరి రెండో వారంలో ఫలితాలు వెల్లడవుతాయి.
పరీక్ష వివరాలు
కనీసం 50% మార్కులు లేదా సమానమైన CGPA తో బ్యాచిలర్ డిగ్రీ ఉన్న అభ్యర్థులు CAT 2021 కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. SC, ST, PWD విద్యార్థులకు అర్హత పరీక్షలో కనీసం 45 శాతం మార్కులు ఉండాలి. గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేదా తత్సమాన అర్హత పరీక్ష చివరి సంవత్సరానికి హాజరయ్యే అభ్యర్థులు, డిగ్రీ పూర్తి చేసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష మూడు సెషన్లలో జరుగుతుంది.