Dream Job: కోరుకున్న ఉద్యోగాన్ని పొందలేకపోతున్నారా.. ఈ టిప్స్ పాటిస్తే విఫలమయ్యే ఛాన్స్ లేదంటోన్న హార్వర్డ్ బిజినెస్ రివ్యూ..

|

Jul 17, 2022 | 12:36 PM

'డ్రీమ్ జాబ్' గురించి ఆలోచించడం అస్సలు మానొద్దు, రెట్టింపు ఉత్సాహంతో ప్రయత్నిస్తే, కచ్చితంగా సాధిస్తారు. డీలా పడితే అనుకున్నది సాధించలేం. కాబట్టి..

Dream Job: కోరుకున్న ఉద్యోగాన్ని పొందలేకపోతున్నారా.. ఈ టిప్స్ పాటిస్తే విఫలమయ్యే ఛాన్స్ లేదంటోన్న హార్వర్డ్ బిజినెస్ రివ్యూ..
Dream Job
Follow us on

మీ జీవితంలో ఒక్కసారైనా కలలుగన్న ప్రదేశంలో పని చేయడానికి(డ్రీమ్ జాబ్) ప్రయత్ని్స్తుంటారు. కానీ, ఎన్నిసార్లు ప్రయత్నించినప్పటికీ, అది జరగకపోవచ్చు. అలా జరిగిందనిన నిరాశపడితే, అనుకున్న స్థానానికి ఎప్పుడూ చేరుకోలేరు. అనుకున్నది సాధించాలంటే మాత్రం ప్రయత్నాలను ఎప్పటికీ ఆపొద్దు. ముందుకు సాగుతూనే ఉండాలి. కచ్చితంగా ఓరోజు మీరు అనుకున్న పనిని చేయగలుగుతారు. మీ ‘డ్రీమ్ జాబ్’ గురించి ఆలోచించడం అస్సలు మానొద్దు, రెట్టింపు ఉత్సాహంతో ప్రయత్నిస్తే, కచ్చితంగా సాధిస్తారు. డీలా పడితే అనుకున్నది సాధించలేం.. కాబట్టి హార్వర్డ్ బిజినెస్ రివ్యూ నుంచి మీ ఎదుగుదలకు సహాయపడే ఈ 4 టిప్స్ గురించి తెలుసుకుంటే, మీరు కచ్చితంగా మీ డ్రీమ్ జాబ్‌ని వశం చేసుకోగలరు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

  1. మొదటిసారి విఫలమయ్యారా.. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి? మీరు మీకు నచ్చిన ఉద్యోగం కోసం దరఖాస్తు చేసి, తిరస్కరణకు గురయ్యారా. అయితే, మీరస్సలు బాధపడొద్దు. మీ ప్రయత్నాలు ఫలించకపోవడానికి గల కారణాలు ముందుగా తెుసుకోవాలి. గతంలో చాలాసార్లు జరిగినట్లు భావిస్తే, వాటిని దాటేందుకు ప్రయత్నించాలి. మీ జీవితంలో వైఫల్యం లేకుండా ఏదీ సాధ్యం కాదని తెలుసుకుని, ముందుకుసాగాలి.
  2. ఓటమి వల్ల నిరుత్సాహపడకండి… స్ఫూర్తిగా తీసుకోండి.. మీకు నిర్దిష్ట నైపుణ్యాలు లేనందున లేదా తగినంత అనుభవం లేనందున తిరస్కరణకు గురైతే, వెంటనే ఆ నైపుణ్యాలను నేర్చుకోవడం ప్రారంభించండి. అనుభవాన్ని పెంచుకోండి. ఇలాంటి పరిస్థితుల్లో చిక్కుకున్న వారికి కూడా ఇదే సలహా ఇవ్వండి. ఇది మిమ్మల్ని ముందుకు సాగడానికి కూడా ప్రేరేపిస్తుంది.
  3. మీ లక్ష్యాన్ని సాధించడానికి ఇతర మార్గాలు వెతికితే బెటర్.. లక్ష్యం ఏదైనా, దానిని చేరుకోవడానికి అనేక మార్గాలు ఉంటాయి. మీకు నచ్చిన ఉద్యోగాన్ని ఎవరు ఇవ్వగలరో తెలుసుకోవడానికి ప్రయత్నించండి. మీకు ఇష్టమైన పనికి సమానమైన ఉద్యోగాలు ఏవైనా ఉన్నాయో లేదో కూడా కనుగొనండి? ఇలా వెతికితే కచ్చితంగా ప్రత్యామ్నాయాలు దొరుకుతాయి.
  4. ఆసక్తితోపాటు అవకాశం.. మీకు ఉద్యోగం రాలేదని తెలియగానే, మీకు ఆ కంపెనీ పట్ల ఇంకా ఆసక్తి ఉందని, మీరు బాగా సరిపోతారని వారు భావిస్తే, మరోసారి ప్రయత్నించడంలో తప్పులేదు. అయితే, అవకాశం వచ్చినప్పుడే, వారిని ఆకట్టుకునేలా ప్రయత్నిస్తే చాలామంచింది. ఆసక్తి ఉంటేనే సరిపోదు. దానికి గల అవకాశాలను కూడా ఏర్పరచుకుంటే చాలా మంచిది
  5. ఇవి కూడా చదవండి