TGPSC Group 4 Results: ‘దసరా కానుకగా టీజీపీఎస్సీ గ్రూప్‌ 4 ఫలితాలు ప్రకటించాలి’ అభ్యర్ధుల డిమండ్‌

|

Oct 04, 2024 | 2:24 PM

తెలంగాణ గ్రూప్‌ 4 పరీక్ష తుది ఫలితాలను తక్షణమే ప్రకటించాలని అక్టోబరు 3న నాంపల్లిలోని టీజీపీఎస్సీ, గాంధీభవన్‌ల వద్ద నిరుద్యోగులు ఆందోళన చేపట్టారు. ఫలితాలు ప్రకటించి, వెంటనే ఉద్యోగ నియామకాలు చేపట్టాలని అభ్యర్థులు డిమాండ్‌ చేశారు. గ్రూప్‌-4 నియామకాలిచ్చి మా జీవితాల్లో వెలుగులు నింపండి.. అంటూ వందల మంది అభ్యర్థులు నినాదాలు చేశారు. వందలాది మంది నిరుద్యోగులు టీజీపీఎస్సీ కార్యాలయం వైపుకు దూసుకు రావడంతో..

TGPSC Group 4 Results: దసరా కానుకగా టీజీపీఎస్సీ గ్రూప్‌ 4 ఫలితాలు ప్రకటించాలి అభ్యర్ధుల డిమండ్‌
TGPSC Group 4 Results
Follow us on

హైదరాబాద్‌, అక్టోబర్‌ 4: తెలంగాణ గ్రూప్‌ 4 పరీక్ష తుది ఫలితాలను తక్షణమే ప్రకటించాలని అక్టోబరు 3న నాంపల్లిలోని టీజీపీఎస్సీ, గాంధీభవన్‌ల వద్ద నిరుద్యోగులు ఆందోళన చేపట్టారు. ఫలితాలు ప్రకటించి, వెంటనే ఉద్యోగ నియామకాలు చేపట్టాలని అభ్యర్థులు డిమాండ్‌ చేశారు. గ్రూప్‌-4 నియామకాలిచ్చి మా జీవితాల్లో వెలుగులు నింపండి.. అంటూ వందల మంది అభ్యర్థులు నినాదాలు చేశారు. వందలాది మంది నిరుద్యోగులు టీజీపీఎస్సీ కార్యాలయం వైపుకు దూసుకు రావడంతో హుటాహుటీన పోలీసు బలగాలు వారిని అడ్డుకున్నాయి. అనంతరం వారంతా గాంధీభవన్‌ వైపు వెళ్లారు. అక్కడ పక్కనే ఉన్న ఖాళీ ప్రదేశంలో నిరసన కార్యక్రమాన్ని కొనసాగించారు. గ్రూప్‌ 4 పోస్టులకు ధ్రువపత్రాల పరిశీలన పూర్తయి రెండు నెలలైనా ఇంకా పోస్టింగ్‌ ఇవ్వలేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. దసరా కానుకగా తుది ఫలితాలు ప్రకటించాలని రేవంత్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అయితే అక్కడికి కూడా వచ్చిన పోలీసులను కొందరు అభ్యర్థులను అదుపులోకి తీసుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది. కాగా మొత్తం 8,180 గ్రూప్‌ 4 పోస్టుల భర్తీకి ఈ నియామక ప్రక్రియ చేపట్టారు. 1:3 నిష్పత్తిలో జనరల్ మెరిట్‌ జాబితాను విడుదల చేసి సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ కూడా పూర్తి చేశారు. అయితే ట్రాన్స్‌జెండర్లకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించకపోవడంపై హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లను విచారించిన న్యాయస్థానం గ్రూప్‌-4 పోస్టుల తుది ఫలితాలు హైకోర్టు తీర్పుకు లోబడి ఉండాలని ఆదేశించింది.

తెలంగాణ లాసెట్‌ చివరి విడత సీట్ల కేటాయింపు పూర్తి

తెలంగాణ లాసెట్‌ చివరి విడత కౌన్సెలింగ్‌ పూర్తైంది. చివరి విడత సీట్లను గురువారం అభ్యర్థులకు కేటాయించారు. కన్వీనర్‌ కోటా కింది 3,158 సీట్లుండగా, వీటిలో 2,991 మందికి సీట్లు దక్కాయని ప్రవేశాల కన్వీనర్‌ ప్రొఫెసర్‌ పి.రమేష్‌బాబు తెలిపారు. తొలివిడతలో 5,363 మంది సీట్లు పొందారు. వారిలో 3,374 మంది ఆయా కళాశాలల్లో రిపోర్టు చేశారని పేర్కొన్నారు. తాజాగా సీట్లు పొందిన వారు అక్టోబర్‌ 7వ తేదీలోపు ట్యూషన్‌ ఫీజు చెల్లించి ఆయా కాలేజీల్లో ధ్రువపత్రాలతో రిపోర్టు చేయాలని సూచించారు.

ఏపీ టెట్‌కు 87.6 శాతం మంది హాజరు.. అక్టోబర్‌ 21 వరకు ఆన్‌లైన్‌ పరీక్షలు

ఏపీ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్‌) పరీక్షలు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. తొలి రోజు 87.6 శాతం మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. మొదటి రోజు 23,301 మందికి గాను 20,413 మంది పరీక్ష రాశారు. రెండు సెషన్లుగా నిర్వహించిన ఈ పరీక్షకు ఉదయం 12,732 మందికి 11,091 హాజరవగా.. మధ్యాహ్నం 10,569 మందికి గానూ 9,322 మంది హాజరయ్యారు. అక్టోబర్‌ 21 వరకు టెట్‌ పరీక్షలు జరుగుతాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.