భారత ప్రభుత్వ సమాచార మంత్రిత్వ శాఖకు చెందిన సెంటర్ ఫర్ డెవలస్‌మెంట్ ఆఫ్ టెలీమాటిక్స్ ఢిల్లీ, బెంగళూరులలో పనిచేయడానికి.. 10 సైంటిస్ట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. అప్లికేషన్స్, రేడియో యాక్సెస్ టెక్నాలజీ, నెట్‌వర్క్ అండ్ సైబర్ సెక్యూరిటీ, ప్రోగ్రామ్ మేనేజ్‌మెంట్, ఆప్టికల్ టెక్నాలజీస్ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి సంబంధిత స్పెషలైజేషన్లో బీటెక్/ఎంటెక్/పీహెచ్‌డీ/ఎంబీఏ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో 10 నుంచి 15 ఏళ్ల అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 58 ఏళ్లకు మించకుండా ఉండాలి.
ఈ అర్హతలు కలిగిన అభ్యర్ధులు డిసెంబర్ 15, 2022వ తేదీలోపు కింది ఈ మెయిల్ ఐడీకి దరఖాస్తులు పంపించవల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ, అనుభవం ఆధారంగా ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన వారికి నెలకు రూ.1,44,200ల నుంచి రూ.2,18, 200ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.