BSNL Recruitment: ఈసీఈ డిప్లొమా పూర్తి చేసిన వారికి సదవకాశం.. బీఎస్‌ఎన్‌ఎల్‌లో అప్రెంటిస్‌ పోస్టులు..

|

Nov 26, 2021 | 5:09 PM

BSNL Recruitment: ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్/టెక్నాలజీలో డిప్లొమా చేసిన వారికి భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బీఎస్‌ఎన్‌ఎల్‌) శుభవార్త తెలపింది. హైదరాబాద్‌లోని బీఎస్‌ఎన్‌ఎల్‌, తెలంగాణ సర్కిల్‌...

BSNL Recruitment: ఈసీఈ డిప్లొమా పూర్తి చేసిన వారికి సదవకాశం.. బీఎస్‌ఎన్‌ఎల్‌లో అప్రెంటిస్‌ పోస్టులు..
Bsnl
Follow us on

BSNL Recruitment: ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్/టెక్నాలజీలో డిప్లొమా చేసిన వారికి భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బీఎస్‌ఎన్‌ఎల్‌) శుభవార్త తెలపింది. హైదరాబాద్‌లోని బీఎస్‌ఎన్‌ఎల్‌, తెలంగాణ సర్కిల్‌ అప్రెంటిస్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 22 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* అప్రెంటిస్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌/టెక్నాలజీలో డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.

* అభ్యర్థుల వయసు అప్రెంటిస్‌షిప్‌ నిబంధనల ఆధారంగా ఉంటుంది.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం అభ్యర్థులు నేషనల్‌ అప్రెంటిస్‌షిప్‌ ట్రైనింగ్‌ స్కీమ్‌ (NATS)పోర్టల్‌ లేదా బీఎస్‌ఎన్‌ఎల్ పోర్టల్‌ ద్వారా అప్లై చేసుకోవచ్చు.

* ఎంపికైన అభ్యర్థులకు హైదరాబాద్‌ బీఎస్‌ఎన్‌ఎల్‌లో ఏడాది పాటు శిక్షణ ఇస్తారు.

* అభ్యర్థులను డిప్లొమాలో సాధించిన మెరిట్‌ మార్కులు, సర్టిఫికేట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

* ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ 20 -11-2021 తేదీన ప్రారంభమైంది.

* నాట్స్‌ పోర్టల్‌లో ఎన్‌రోల్‌ చేసుకోవడానికి చివరి తేదిగా 29.11.2021 నిర్ణయించారు.

* బీఎస్‌ఎన్‌ఎల్‌ పోర్టల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి 02.12.2021ని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: MAA : మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌లో మరో లొల్లి.. గత కొన్ని రోజులుగా మా ఆఫీస్‌కు తాళం?

Inspiration: కూలీ కొడుకు నీట్ కొట్టాడు.. ఆ గ్రామంలో తొలి డాక్టర్ కాబోతున్నాడు

ZSI Recruitment 2021: జూలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియాలో రీసెర్చ్‌ ఫెలో ఉద్యోగాలు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..