న్యూఢిల్లీలోని డైరెక్టరేట్ జనరల్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF)… స్పోర్ట్స్ కోటాలో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) గ్రూప్ సి పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 275 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 30వ తేదీలోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) నాన్-గెజిటెడ్ అండ్ నాన్ మినిస్టీరియల్ (స్పోర్ట్స్ కోటా)లోని 275 పోస్టులను సంబంధిత క్రీడాంశంలో అర్హత కలిగిన వారికి కేటాయిస్తారు.
ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, స్విమ్మింగ్, డైవింగ్, వాటర్ పోలో, బాస్కెట్‌బాల్, బాక్సింగ్, సైక్లింగ్, క్రాస్ కంట్రీ, ఈక్వెస్ట్రియన్, ఫుట్‌బాల్, జిమ్నాస్టిక్స్, హ్యాండ్‌బాల్, హాకీ, ఐస్-స్కీయింగ్, జూడో, కరాటే, వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్, వాటర్ స్పోర్ట్స్, రెజ్లింగ్, షూటింగ్, టైక్వాండో, వుషు, ఫెన్సింగ్.. వంటి మొత్తం 27 క్రీడాంశాల్లో ఖాళీలు ఉన్నాయి.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణతతో పాటు నేషనల్ లేదా ఇంటర్నేషనల్ ఈవెంట్స్‌లో సంబంధిత క్రీడాంశాల్లో పాల్గొని ఉండాలి. లేదా ట్రోఫీలు సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి తప్పనిసరిగా 01 జనవరి 2025 నాటికి 18 నుంచి 23 సంవత్సరాల మధ్య ఉండాలి. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌లో డిసెంబర్ 30, 2024వ తేదీ రాత్రి 11.59 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుము కింద జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు రూ.147 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
అప్లికేషన్స్ షార్ట్‌లిస్టింగ్, ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ (పీఎస్‌టీ) ఆధారంగా అభ్యర్ధుల తుది ఎంపిక ఉంటుంది. ఎలాంటి రాత పరీక్ష నిర్వహించరు. ఎంపికైన వారికి నేరుగా జాబ్ కేటాయిస్తారు. వీరికి నెలకు 7th పే స్కేల్ కింద రూ.21,700 నుంచి రూ.69,100 వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర వివరాలు ఈ కింది అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
బీఎస్‌ఎఫ్‌లో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.