BRO Recruitment 2023: పదో తరగతి అర్హతతో కేంద్ర కొలువులు! బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌లో 567 ఉద్యోగాలు..

|

Jan 03, 2023 | 7:43 PM

న్యూఢిల్లీలోని బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌కు చెందిన జనరల్ రిజర్వ్ ఇంజనీర్ ఫోర్సులో.. 567 వెహికల్ మెకానిక్, డ్రైవర్ మెకానికల్ ట్రాన్స్‌పోర్ట్, ఆపరేటర్ కమ్యూనికేషన్ తదితర పోస్టుల భర్తీకి..

BRO Recruitment 2023: పదో తరగతి అర్హతతో కేంద్ర కొలువులు! బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌లో 567 ఉద్యోగాలు..
Border Roads Organization
Follow us on

న్యూఢిల్లీలోని బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌కు చెందిన జనరల్ రిజర్వ్ ఇంజనీర్ ఫోర్సులో.. 567 వెహికల్ మెకానిక్, డ్రైవర్ మెకానికల్ ట్రాన్స్‌పోర్ట్, ఆపరేటర్ కమ్యూనికేషన్ తదితర పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి, ఐటీఐ, ఇంటర్మీడియట్‌ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. డ్రైవింగ్‌ లైసెన్స్‌ కూడా ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 18 నుంచి 27 యేళ్ల మధ్య ఉండాలి.

ఈ అర్హతలున్న అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ విధానంలో కింది అడ్రస్ కు ప్రకటన విడుదలైన 45 రోజుల్లోపు (జనవరి 20) పోస్టు ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్‌, ఈడబ్ల్యూఎస్‌, ఎక్స్‌సర్వీస్‌మెన్‌ అభ్యర్ధులు దరఖాస్తు రుసుముగా రూ.50 చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. రాత పరీక్ష, ఫిజికల్‌ మెజర్‌మెంట్‌ టెస్ట్‌, ప్రాక్టికల్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా జీతభత్యాలు చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు:

  • రేడియో మెకానిక్ పోస్టులు: 2
  • ఆపరేటర్ కమ్యూనికేషన్ పోస్టులు: 154
  • డ్రైవర్ మెకానికల్ ట్రాన్స్‌పోర్ట్(ఓజీ) పోస్టులు: 9
  • వెహికల్ మెకానిక్ పోస్టులు: 236
  • ఎంఎస్‌డబ్ల్యూ డ్రిల్లర్ పోస్టులు: 11
  • ఎంఎస్‌డబ్ల్యూ మేసన్ పోస్టులు: 149
  • ఎంఎస్‌డబ్ల్యూ పెయింటర్ పోస్టులు: 5
  • ఎంఎస్‌డబ్ల్యూ మెస్ వెయిటర్ పోస్టులు: 1అడ్రస్‌: Commandant BRO School & Centre, Dighi camp, Pune- 411 015.

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.