భారతీయ పశుపాలన్ నిగమ్ లిమిటెడ్ ఖాళీలను భర్తీ చేస్తోంది. భారతీయ పశుపాలన్ నిగమ్ లిమిటెడ్ (BPNL)లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఉన్న ఈ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో పలు ఖాళీలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌లో భాగంగా 3444 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ప్రస్తుతం ఈ పోస్టులకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. దరఖాస్తుల స్వీకరణకు గడువు జూలై 5వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎవరు అర్హులు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
మొత్తం 3444 ఖాళీలకు గాను వీటిలో 574 సర్వే ఇన్‌ఛార్జ్ పోస్టులు ఉండగా, 2870 సర్వేయర్ పోస్టులు ఉన్నాయి. వీటికి అప్లై చేసుకునే క్యాండిడేట్స్ ఆన్‌లైన్ పద్ధతిలో అప్లై చేసుకోవాలి. ఇక అర్హత విషయానికొస్తే.. ఖాళీల ఆధారంగా పదో తరగతి లేదా ఇంటర్మీడియట్‌లో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అభ్యర్థులలు ఆన్‌లైన్ పద్ధతిలో అప్లై చేసుకోవాలి. సర్వే ఇన్‌ఛార్జ్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు అప్లికేషన్ ఫీజుగా రూ. 944, సర్వేయర్ పోస్టులకు రూ. 826 అప్లికేషన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.
క్యాండిడేట్స్‌ను ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఖాళీల ఆధారంగా క్యాండిడేట్స్ వయసు 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 24 వేల వరకు జీతం అందిస్తారు. దరఖాస్తుల స్వీకరణకు గడువు జూలై 05వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..