BSF Paramedical Recruitment 2021: బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్) పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖకు చెందిన డైరక్టరేట్ జనరల్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో పారా మెడికల్, వెటర్నీ స్టాఫ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా మొత్తం 110 పోస్టులను తీసుకోనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..
* నోటిఫికేషన్‌లో భాగంగా ఎన్ఐ (స్టాఫ్ నర్స్), ఏఎన్‌ఐ టెక్నీషియన్, సీటీ వార్ బాయ్, హెచ్ సీ (వెటర్నరీ), కానిస్టేబుల్ పోస్టులను భర్తీచేయనున్నారు.
* ఎన్‌ఐ(స్టాఫ్ నర్స్) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంటర్మీడియట్, డిగ్రీ/డిప్లొమా(జీఎన్‌ఎం) ఉత్తీర్ణులవ్వాలి. అభ్యర్థుల వయసు 30 ఏళ్లు మించకూడదు.
* ఏఎన్‌ఐ టెక్నీషియన్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు 10+2, డిప్లొమా, డీఎంఎల్‌టీ ఉత్తీర్ణులవ్వాలి. అభ్యర్థుల వయసు 25 ఏళ్లు మించకూడదు.
* సీటీ వార్డ్ బాయ్ పోస్టుకు అప్లై చేసుకునే వారు మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణులవ్వాలి. వయసు 23 ఏళ్లు మించకూడదు.
* హెచ్‌సీ(వెటర్నరీ)కి అప్లై చేసుకునే వారు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులవ్వాలి. అభ్యర్థుల వయసు 25 ఏళ్లు మించకూడదు.
* కానిస్టేబుల్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే వారు పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. వయసు 25 ఏళ్లు మించకూడదు.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీగా 24-07-2021ని నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..