BHEL Recruitment: భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ (BHEL) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ తమిళనాడులోని తిరుచిరాపల్లిలో ఉన్న అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 575 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* టెక్నీషియన్ విభాగాల్లో భాగంగా మెకానికల్ (52), కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (15), సివిల్ ఇంజనీరింగ్ (10), ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (06), ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ (6), ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ (01) ఖాళీలు ఉన్నాయి.
* గ్రాడ్యుయేట్ విభాగాలకు కాను మెకానికల్ (52), సీఎస్‌ఈ/ఐటీ (15), సివిల్ ఇంజనీరింగ్ (8), ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (06), ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ (02), కెమికల్ ఇంజనీరింగ్ (01), అకౌంటెంట్ (04), అసిస్టెంట్ హెచ్‌ఆర్ (03), బీఎస్‌సీ నర్సింగ్ (02), బి. ఫార్మ్ (02) ఖాళీలు ఉన్నాయి.
* ఐటీఐ విభాగాల్లో భాగంగా ఫిట్టర్ (186), వెల్డర్ (120), ఎలక్ట్రీషియన్ (34), టర్నర్ (14), మెషినిస్ట్ (14), మెకానిక్ ఆర్ అండ్ ఏసీ (06), ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్ (06), కార్పెంటర్ (04), మెకానిక్ మోటార్ వెహికల్ (04), ప్లంబర్ (02) ఖాళీలు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్/డిప్లొమా/ఐటీఐ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
* అభ్యర్థుల వయసు 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ 26-08-2022న మొదలై 07-09-2022తో ముగియనుంది.
* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..