BHEL Recruitment: ఇంజనీరింగ్ చేసిన వారికి బీహెచ్‌ఈఎల్‌లో ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే అభ్యర్థుల ఎంపిక.

|

Dec 30, 2021 | 8:56 AM

BHEL Recruitment: భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌ (బీహెచ్‌ఈఎల్‌) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీచేసింది. భారత ప్రభుత్వరంగానికి చెందిన ఈ సంస్థలో పవర్‌ సెక్టర్‌ వెస్టర్న్‌ రీజియన్‌లో ఖాళీలను భర్తీ చేయనున్నారు...

BHEL Recruitment: ఇంజనీరింగ్ చేసిన వారికి బీహెచ్‌ఈఎల్‌లో ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే అభ్యర్థుల ఎంపిక.
Follow us on

BHEL Recruitment: భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌ (బీహెచ్‌ఈఎల్‌) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీచేసింది. భారత ప్రభుత్వరంగానికి చెందిన ఈ సంస్థలో పవర్‌ సెక్టర్‌ వెస్టర్న్‌ రీజియన్‌లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. కాంట్రాక్ట్‌ విధానంలో తీసుకోనున్న ఈ పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 36 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో సివిల్‌ ఇంజనీర్‌ (10), సూపర్‌ వైజర్లు (26) పోస్టుల భర్తీ చేయనున్నారు.

* ఇంజనీర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సివిల్‌ ఇంజనీరింగ్‌లో నాలుగేళ్ల ఫుల్‌ టైం బ్యాచిలర్స్‌ డిగ్రీ/ ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ మాస్టర్స్‌ డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. వీటితో పాటు అనుభవం తప్పనిసరి.

* సూపర్‌ వైజర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు కనీసం 60 శాతం మార్కులతో సివిల్ ఇంజనీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పనిలో కనీసం ఐదేళ్ల అనుభవం ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* ముందుగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న తర్వాత, హార్డ్‌ కాపీలను సీనియర్‌ డిప్యూటీ మేనేజర్, బీహెచ్‌ఈఎల్‌, పవర్‌ సెక్టర్‌, వెస్ట్రన్‌ రీజియన్‌, నాగ్‌పూర్ 44001 అడ్రస్‌కు పంపించాలి.

* ఇంజనీర్‌ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ. 71,040, సూపర్‌ వైజర్‌ పోస్టులకు ఎంపికైన వారికి రూ. 39,670 జీతంగా అందిస్తారు.

* అభ్యర్థులను ముందుగా బీఈ/ బీటెక్‌, డిప్లొమాలో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్టింగ్‌ చేస్తారు. అనంతరం ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.

* ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు 11-01-2021, హార్డ్‌కాపీలను పంపడానికి 14-01-2021ని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: D Imman: సినిమా ఇండస్ట్రీలో మరో డివోర్స్‌.. 13 ఏళ్ల వైవాహిక బంధానికి వీడ్కోలు పలికిన స్టార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌..

Encounter: జమ్మూ కాశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ఇద్దరు పాకిస్థానీలతో సహా ఆరుగురు ఉగ్రవాదులు మృతి

ICC Awards: టీ20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌ జాబితాలో చేరిన ‘ఆ నలుగురు’.. భారత ఆటగాళ్లకు దక్కని చోటు