BDL Recruitment 2022: తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు బంపరాఫర్‌! టెన్త్, డిప్లొమా అర్హతతో 80 ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలు..

|

May 11, 2022 | 12:54 PM

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ (BDL) తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వివిధ యూనిట్లలో.. ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ (డిప్లొమా) అసిస్టెంట్‌ పోస్టుల (Project Assistant Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి..

BDL Recruitment 2022: తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు బంపరాఫర్‌! టెన్త్, డిప్లొమా అర్హతతో 80 ప్రాజెక్ట్‌  అసిస్టెంట్‌ ఉద్యోగాలు..
Govt Jobs
Follow us on

Bharat Dynamics Limited Recruitment 2022: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ (BDL) తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వివిధ యూనిట్లలో.. ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ (డిప్లొమా) అసిస్టెంట్‌ పోస్టుల (Project Assistant Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 80

ఖాళీల వివరాలు: ప్రాజెక్ట్‌ (డిప్లొమా) అసిస్టెంట్‌, ప్రాజెక్ట్‌ ట్రేడ్‌ అసిస్టెంట్‌ పోస్టులు

  • ప్రాజెక్ట్‌ (డిప్లొమా) అసిస్టెంట్‌ పోస్టులు: 36

విభాగాలు: ఎలక్ట్రికల్‌, టూల్‌ డిజైన్‌, హెచ్‌ఆర్‌, ఫైనాన్స్‌, ఎలక్ట్రానిక్స్‌, మెకానికల్‌, కంప్యూటర్స్‌ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి.

అర్హతలు: పోస్టును బట్టి పదో తరగతి, సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజనీరింగ్‌ డిప్లొమా, గ్రాడ్యుయేషన్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 28 ఏళ్లకు మించరాదు.

  • ప్రాజెక్ట్‌ ట్రేడ్‌ అసిస్టెంట్ పోస్టులు: 44

విభాగాలు: ఎలక్ట్రానిక్ మెకానికల్‌, పెయింటర్‌, వెల్డర్‌, స్టెనోగ్రాఫర్‌, ఫిట్టర్‌, ఎలక్ట్రీషియన్‌ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి.

అర్హతలు: పదో తరగతి, సంబంధిత ట్రేడుల్లో ఐటీఐలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో ఏడాది అనుభవం కూడా ఉండాలి.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 28 ఏళ్లకు మించరాదు.

ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్, అనుభవం, రిజర్వేషన్‌, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము:

  • జనరల్ అభ్యర్ధులకు: రూ.200
  • ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ: మే 14, 2022.

దరఖాస్తులకు చివరి తేదీ: జూన్‌ 4, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

AP CAS Recruitment 2022: ఆంధ్రప్రదేశ్‌లో 31 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. అర్హతలివే!