ITI Limited Recruitment 2021: భారత ప్రభుత్వ రంగానికి చెందిన ఐటీఐ లిమిటెడ్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. బెంగళూరులో ఉన్న ఈ సంస్థలో మొత్తం 22 ఖాళీలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం.
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 22 ఖాళీలను భర్తీచేయనున్నారు.
* పోస్టుల వివరాలు.. ల్యాబ్ టెక్నీషియన్ (01), సూపర్ వైజర్ (06), ఇన్‌స్పెక్టర్లు/టెస్టర్ (03), ఆపరేటర్ (12) ఖాళీలున్నాయి.
* ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కెమికల్ విభాగంలో మూడేళ్ల ఇంజినీరింగ్ డిప్లొమా/బీఎస్సీ (పీసీఎం)లో ఉత్తీర్ణత పొంది ఉండాలి.
* సూపర్ వైజర్ పోస్టుకు అప్లై చేసుకునే వారు మెకానికల్ ఇంజినీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా ఉత్తీర్ణత పొంది ఉండాలి.
* ఇన్‌స్పెక్టర్లు/టెస్టర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు మెకానికల్ ఇంజినీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా ఉత్తీర్ణతను అర్హతగా నిర్ణయించారు.
* ఆపరేటర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఎస్‌ఎస్‌ఎల్‌సీ/పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణత పొంది ఉండాలి.
* పైన తెలిపిన పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థుల వయసు 28 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు సడలింపు ఇచ్చారు.
* అభ్యర్థులను కాంపిటీటివ్ ఆప్టిట్యూడ్/టెక్నికల్ టెస్ట్/గ్రూప్ టాస్క్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
* ఆఫ్‌లైన్ దరఖాస్తులను అడిష్మనల్ జనరల్ మేనేజర్-హెచ్‌ఆర్, ఐటీఐ లిమిటెడ్ బెంగళూరు, దూర్వాని నగర్, 560016 అడ్రస్‌కు పంపించాలి.
* ఆన్‌లైన్ దరఖాస్తులకు 22-07-2021, ఆఫ్‌లైన్ స్వీకరణకు 18-07-2021ని చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: Hyderabad: వయసేమో చిన్నది.. చేసే పనులు మాత్రం చాలా పెద్దవి.. మ్యాటర్ తెలిస్తే షాక్ అవుతారు..!
India Corona Updates: తగ్గుతున్న కోవిడ్ ఉద్ధృతి.. కొత్తగా 44,111 కేసులు..738 మరణాలు
Tamil Nadu Lockdown Extends: తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం.. లాక్‌డౌన్ పొడిగిస్తూ నిర్ణయం..!