Three-day Week: స్టార్టప్ కంపెనీ బంపర్ ఆఫర్.. వారానికి 3 రోజులే పని.. ఎక్కడంటే..

|

Oct 05, 2021 | 2:03 PM

వారంలో ఆరు రోజుల పని.. ఒక్క రోజు సెలవు. ఇలా కాదు వారం ఐదు రోజుల పని రెండు రోజుల సెలవులు.. ప్రపంచ వ్యాప్తంగా సగటు ఉద్యోగి పనివేలలు.

Three-day Week: స్టార్టప్ కంపెనీ బంపర్ ఆఫర్.. వారానికి 3 రోజులే పని.. ఎక్కడంటే..
Fintech Company
Follow us on

వారంలో ఆరు రోజుల పని.. ఒక్క రోజు సెలవు. ఇలా కాదు వారం ఐదు రోజుల పని రెండు రోజుల సెలవులు.. ప్రపంచ వ్యాప్తంగా సగటు ఉద్యోగి పనివేలలు. ఇలా కాదు మేము కొత్త పద్దతిని ఎంచుకున్నామంటోంది ఓ స్టార్టప్ కంపెనీ. వారంలో మూడు రోజుల పాటు పని చేస్తే చాలా.. 80 శాతం చెల్లిస్తామంటోంది. బెంగళూరుకు చెందిన ఫిన్‌టెక్ స్టార్టప్ కంపెనీ ‘స్లైస్’ ఓ సరికొత్త ఐడియాతో ముందుకొచ్చింది. ఈ కంపెనీ ఇచ్చిన ప్రకటన ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీస్తోంది. సరికొత్తగా ఆలోచిద్దామంటోంది.

సగటు మనుషుల జీవితం మొత్తం పనితో గడిపేయడాన్ని తాము విరుద్దమని.. ఉద్యోగం చేసుకుంటూనే ఇతర హాబీలను కొనసాగించుకోవచ్చని కంపెనీ వ్యవస్థాపకుడు రాజన్ బజాజ్ ఓ ప్రకటన చేశాడు. ‘ఫ్యూచర్ వర్క్’ ఇదేనని జోస్యం చెబుతున్నాడు. ప్రజలు ఒక్క ఉద్యోగానికే పరిమితం కావాలనుకోవడం లేదని కూడా అభిప్రాయ పడుతున్నాడు.

అయితే ఇతని కంపెనీలో ఇప్పటికే 450 మంది ఉద్యోగులు ఉన్నారు. వచ్చే మూడేళ్లలో మరో 1000 మంది ఇంజినీర్లు, ప్రొడక్ట్ మేనేజర్లను రిక్రూట్ చేసుకోవాలనే ప్లాన్‌ ఉన్నట్లుగా తెలిపాడు. ఉద్యోగులు మూడు రోజులు పనిచేసినా పూర్తిస్థాయిలో వేతనాలతోపాటు ఇతర ప్రయోజనాలు లభిస్తాయని రాజన్ బజాజ్ వెల్లడించాడు.

మిగతా సమయాన్ని వారు తమ కలలను నెరవేర్చుకోవడానికి ఉపయోగించుకోవచ్చని తెలిపాడు.  ఇటీవల సైబర్ సెక్యూరిటీ కంపెనీ టీఏసీ సెక్యూరిటీ నాలుగు రోజుల పనివిధాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఉత్పాదికతను మరింత పెంచేందుకు గత ఏడు నెలలుగా శుక్రవారం కూడా సెలవు ప్రకటించింది. చూద్దాం ఇది సక్సెస్ అయితే అంతా ఇదే ఫాలో అయ్యే ఛాన్స్ ఉంది.

ఇవి కూడా చదవండి:  Priyanka Gandhi: నన్ను ఎందుకు నిర్బంధించారో చెప్పండి.. ప్రధాని మోడీని ప్రశ్నించిన ప్రియాంక..

Aryan Khan drug case: ఆర్యన్‌ఖాన్‌ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. మూడ్రోజుల కస్టడీ.. మరో ఇద్దరి అరెస్ట్..