BEL Recruitment 2021: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేయండి..

|

Oct 27, 2021 | 1:11 PM

BEL Recruitment 2021: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో ఉద్యోగం పొందడానికి మంచి అవకాశం వచ్చింది. 73 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి కంపెనీ నోటిఫికేషన్ విడుదల చేసింది.

BEL Recruitment 2021: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేయండి..
Bel Recruitment 2021
Follow us on

BEL Recruitment 2021: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో ఉద్యోగం పొందడానికి మంచి అవకాశం వచ్చింది. 73 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి కంపెనీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న అభ్యర్థులు బోర్డ్ ఆఫ్ అప్రెంటీస్ ట్రైనింగ్ అధికారిక వెబ్‌సైట్‌ boat-srp.comని సందర్శించగలరు. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ జారీ చేసిన నోటీసు ప్రకారం.. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 25 అక్టోబర్ 2021 నుంచి ప్రారంభమైంది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు 25 నవంబర్ 2021లోపు లేదా అంతకంటే ముందు BEL రిక్రూట్‌మెంట్ వెబ్‌సైట్‌ను సందర్శించి అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు చేయడానికి ముందు నోటిఫికేషన్‌ని చదివితే మంచిది. అర్హత, ఫీజుల వివరాలను తెలుసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు..
1. దరఖాస్తు ప్రారంభ తేదీ: 25 అక్టోబర్
2. NATS పోర్టల్‌లో నమోదు చేసుకోవడానికి చివరి తేదీ – నవంబర్ 10
3. దరఖాస్తుకు చివరి తేదీ – 25 నవంబర్ 2021
4. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థుల జాబితా విడుదల – 30 నవంబర్ 2021
5. షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థుల పత్రాల పరిశీలన – 8 డిసెంబర్, 9 డిసెంబర్ 2021

ఇలా దరఖాస్తు చేసుకోండి..
1. దరఖాస్తు చేసుకోవాలంటే ముందుగా రిక్రూట్‌మెంట్ పోర్టల్-bot-srp.comకు వెళ్లండి.
2. వెబ్‌సైట్ హోమ్ పేజీలో జాబ్ రిక్రూట్‌మెంట్‌పై క్లిక్ చేయండి.
3. ఇప్పుడు అప్రెంటిస్ ఆప్షన్‌కి వెళ్లండి.
4. ఓపెన్‌ అయిన లింక్‌పై క్లిక్ చేయండి.
5. రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయండి.
6. రిజిస్ట్రేషన్ తర్వాత దరఖాస్తు ఫారమ్‌ను నింపండి.

ఎంపిక ఎలా ఉంటుంది
ఆన్‌లైన్ అప్లికేషన్‌లో ఇచ్చిన మెరిట్ ఆధారంగా అభ్యర్థులు షార్ట్‌లిస్ట్ చేస్తారు. అభ్యర్థుల ఈ మెయిల్ చేస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం అభ్యర్థులు చెన్నై వెళ్లాల్సి ఉంటుంది. గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంజనీర్ లేదా టెక్నాలజీలో డిగ్రీని కలిగి ఉండాలి. వయోపరిమితి మరియు అర్హత గురించి పూర్తి సమాచారం కోసం, అధికారిక నోటిఫికేషన్‌ను చూడండి.

ప్రియుడి కోసం కొట్టుకున్న ఇద్దరు ప్రియురాళ్లు.. సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న ఫైటింగ్‌ వీడియో..

Hrithik Roshan: ‘క్రిష్ 4’లో పాట పాడుతున్న హృతిక్‌ రోషన్‌.. ఫ్యాన్స్‌కి ఇక పండుగే..!

Telia Bhola: మత్య్సకారులు వలలో చిక్కిన అరుదైన భారీ చేప.. వేలంలో రూ.36 లక్షల ధర.. జాలర్లకు పండగే పండగ..