BEL recruitment 2021: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ హైదరాబాద్‌లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ప్రాజెక్ట్ ఇంజనీర్ విభాగంలో వివిధ పోస్టులకు భర్తీకి గానూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు ఆగస్టు 4వ తేదీ వరకు అవకాశం కల్పించారు. అంటే ఇవాళ ఒక్కరోజే అప్లికేషన్‌కు మిగిలి ఉంది. ఇంకా దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు BEL అధికారిక వెబ్‌సైట్ అయిన bel-india.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. బీఈఎల్ హైదరాబాద్ యూనిట్‌లో మొత్తం 49 ఖాళీలు భర్తీ చేయనున్నారు.
బీఈఎల్‌లో ఖాళీల వివరాలు..
మొత్తం 49 ఖాళీలలో, ప్రాజెక్ట్ ఇంజనీర్- I (ఎలక్ట్రానిక్స్) – 36, ప్రాజెక్ట్ ఇంజనీర్- I (మెకానికల్) – 8, ప్రాజెక్ట్ ఇంజనీర్- I (కంప్యూటర్ సైన్స్) – 4, ప్రాజెక్ట్ ఆఫీసర్- I (మానవ వనరులు) 1 పోస్టు ఖాళీగా ఉన్నాయి.
బీఈఎల్ రిక్రూట్‌మెంట్ 2021 దరఖాస్తు ప్రక్రియ..
ప్రాజెక్ట్ ఇంజనీర్ -1, ప్రాజెక్ట్ ఆఫీసర్ -1 పోస్టుల కోసం దరఖాస్తు రుసుము రూ. 500. PWD, SC, ST కేటగిరీ అభ్యర్థులకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు. కాగా, ఫీజు చెల్లించే అభ్యర్థులు ఈ ఫీజును ఎస్‌బిఐ కలెక్ట్ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది(ఆన్‌లైన్ లేదా ఎస్‌బిఐ బ్రాంచ్ ద్వారా). ఆ తరువాత అప్లికేషన్ సమయంలో అభ్యర్థులు ఎస్‌బిఐ కలెక్ట్ రిఫరెన్స్ నెంబర్‌ను నమోదు చేయాల్సి ఉంటుంది.
ఎలా దరఖాస్తు చేయాలి..
1. BEL- అధికారిక వెబ్‌సైట్ bel-india.in లోకి వెళ్లాలి.
2. కెరీర్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
3. సైన్ అప్ చేసి.. అవసరమైన అన్ని వివరాలను నమోదు చేయాలి.
4. రిజిస్ట్రేషన్ నెంబర్, లాగిన్ ఐడి మీ రిజిస్టర్డ్ మెయిల్ ఐడికి పంపబడతాయి.
5. ఆ తరువాత దరఖాస్తు ఫారాన్ని నింపాల్సి ఉంటుంది.
6. ఫోటో, సంతకాన్ని అప్‌లోడ్ చేయాలి. అనంతరం అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
7. భవిష్యత్ అవసరం కోసం సాఫ్ట్ కాపీని, హార్డ్ కాపీని భద్రంగా ఉంచుకోవాలి.
Also read: