BECIL Recruitment 2022: నిరుద్యోగులకు అలర్ట్.. పదో తరగతి అర్హతతో 123 కేంద్ర కొలువులు..దరఖాస్తుకు నేడే ఆఖరు!

|

Jun 28, 2022 | 9:55 PM

భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వశాఖకు చెందిన బ్రాడ్‌కాస్ట్‌ ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌ (BECIL), బిలస్‌పూర్‌లోని ఎయిమ్స్‌లో.. లోయర్ డివిజన్‌ క్లర్క్‌, లైబ్రేరియన్‌ తదితర పోస్టుల (Lower Division Clerk Posts) భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ఈ రోజుతో ముగుస్తుంది..

BECIL Recruitment 2022: నిరుద్యోగులకు అలర్ట్.. పదో తరగతి అర్హతతో 123 కేంద్ర కొలువులు..దరఖాస్తుకు నేడే ఆఖరు!
Becil Jobs
Follow us on

BECIL Lower Division Clerk Recruitment 2022: భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వశాఖకు చెందిన బ్రాడ్‌కాస్ట్‌ ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌ (BECIL), బిలస్‌పూర్‌లోని ఎయిమ్స్‌లో.. లోయర్ డివిజన్‌ క్లర్క్‌, లైబ్రేరియన్‌ తదితర పోస్టుల (Lower Division Clerk Posts) భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ఈ రోజుతో ముగుస్తుంది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని అర్హులైన అభ్యర్ధులకు చివరి అవకాశం.. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 123

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు: లోయర్ డివిజన్‌ క్లర్క్‌, లైబ్రేరియన్‌, స్టెనోగ్రాఫర్‌, జూనియర్‌ వార్డెన్‌, స్టోర్ కీపర్‌ తదితర పోస్టులు

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 45 ఏళ్లకు మించరాదు.

పే స్కేల్: నెలకు రూ.18,750ల నుంచి రూ.44,900ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి పదో తరగతి, సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంటర్‌, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమాలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము:

జనరల్‌ అభ్యర్ధులకు: రూ.750
ఎస్సీ/ఎస్టీ/ఈడబ్ల్యూఎస్/పీహెచ్‌అభ్యర్ధులకు: రూ.450

దరఖాస్తులకు చివరి తేదీ: జూన్‌ 28, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.