BECIL Recruitment: బీఈసీఐఎల్‌లో ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఎంపిక..

|

May 03, 2022 | 11:54 AM

BECIL Recruitment: బ్రాడ్‌కాస్ట్‌ ఇంజీనిరింగ్ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌ (BECIL) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. కోల్‌కతాలో ఉన్న నేషనల్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌లో పలు పోస్టులను భర్తీ చేయనున్నారు...

BECIL Recruitment: బీఈసీఐఎల్‌లో ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఎంపిక..
Becil Jobs
Follow us on

BECIL Recruitment: బ్రాడ్‌కాస్ట్‌ ఇంజీనిరింగ్ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌ (BECIL) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. కోల్‌కతాలో ఉన్న నేషనల్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌లో పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 07 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో అసిస్టెంట్‌ ఫార్మసిస్ట్‌ (01), రేడయోథెరపీ టెక్నీషియన్స్‌ (04), ఓటీ టెక్నీషియన్లు (02) ఖాళీలు ఉన్నాయి.

* పైన తెలిపిన ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా ఇంటర్మీడియట్‌, డిప్లొమా (ఫార్మసీ), బీఎస్సీ (రేడియోథెరపీ టెక్నాలజీ) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దీంతో పాటు సంబంధిత పనిలో అనుభవం తప్పనిసరిగా ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకి హాజరు కావాల్సి ఉంటుంది.

* ఇంటర్వ్యూలను చిత్తరంజన్‌ నేషనల్‌ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌, కోల్‌కతా, డీజే బ్లాక్‌, యాక్షన్‌ ఏరియా, న్యూటన్‌, కోల్‌కతాలో నిర్వహిస్తారు.

* వాక్‌ ఇంటర్వ్యూలను మే 06, 09, 17 తేదీల్లో నిర్వహించనున్నారు.

* అభ్యర్థులను పని అనుభవం, ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

Also Read: YS Jagan: ఉపాధి హామీ పెండింగ్‌ బిల్లులు చెల్లింపునకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్..

Realme Narzo 50A Prime: సరికొత్త రియల్‌మీ నార్జో 50A ప్రైమ్‌ ఫీచర్లు ఇవే

Kisan Drone Subsidy: రైతులకు శుభవార్త.. రూ. 5 లక్షలు సహాయం చేస్తున్న కేంద్రం.. ఎందుకోసమంటే..!