Bank Of Maharashtra Jobs 2025: ఎలాంటి రాత పరీక్షలేకుండానే.. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఉద్యోగాలు! నెలకు లక్షన్నర జీతం

Bank Of Maharashtra Job Notification 2025: దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ బ్రాంచుల్లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మేనేజర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ బ్యాంక్ ఆఫ్‌ మహారాష్ట్ర నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే కేవలం విద్యార్హతలు, అనుభవం, ఇంటర్వ్యూ, గ్రూప్‌ డిస్కషన్‌ ఆధారంగా తుది ఎంపిక..

Bank Of Maharashtra Jobs 2025: ఎలాంటి రాత పరీక్షలేకుండానే.. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఉద్యోగాలు! నెలకు లక్షన్నర జీతం
Bank Of Maharashtra Manager Jobs

Updated on: Sep 15, 2025 | 7:06 PM

బ్యాంక్ ఆఫ్‌ మహారాష్ట్ర.. శాశ్వత ప్రాతిపదికన దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ బ్రాంచుల్లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మేనేజర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. అసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 350 డిప్యూటీ జనరల్‌/ అసిస్టెంట్‌ జనరల్‌/ ఛీఫ్‌/ సీనియర్ మేనేజర్‌/ మేనేజర్‌ పోస్టులను భర్తీ చేయనుంది. ఐటీ, డిజిటల్‌ బ్యాంకింగ్‌, ఐటీ సెక్యూరిటీ, ఐఎస్‌ ఆడిట్‌, సీఐఎస్‌ఓ, ట్రెజరీ, ఇంటర్నేషనల్ బిజినెస్‌, లీగల్‌, ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌ అండ్ అకౌంట్స్‌, క్రెడిట్‌, సీఏ, ఇంటిగ్రేటెడ్‌ రిస్క్‌ మేనేజ్‌మెంట్, మార్కెటింగ్‌ అండ్ పబ్లిసిటీ.. తదితర విభాగాల్లో ఈ ఖాళీలను భర్తీ చేయనుంది. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోవచ్చు..

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీటెక్‌/బీఈ, ఎంఎస్సీ, ఎంసీఏ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. అలాగే నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా పని అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి తప్పనిసరిగా 25 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్‌ వర్గాలకు నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. అర్హత కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో సెప్టెంబర్ 30, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు ఫీజు కింద జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.1180, ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు రూ. 118 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. ఎలాంటి రాత పరీక్షలేకుండానే విద్యార్హతలు, అనుభవం, ఇంటర్వ్యూ, గ్రూప్‌ డిస్కషన్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి 6 నెలల పాటు ప్రొబేషన్‌ పిరియడ్‌ ఉంటుంది. ఈ సమయంలో రూ.2 లక్షలు చెల్లిస్తారు. ఆ తర్వాత నెలకు ఆయా పోస్టులను బట్టి రూ.64,820 నుంచి రూ.1,45,500 వరకు జీతంగా చెల్లిస్తారు.

ఇవి కూడా చదవండి

నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.