Bank Of Maharashtra Recruitment: బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్రలో ఉద్యోగాలు.. చివరి తేదీ ఎప్పుడు.. ఎలా అప్లై చేసుకోవాలంటే

|

Mar 27, 2021 | 12:20 PM

Bank Of Maharashtra Recruitment 2021: ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్‌ అయిన బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర తాజాగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా...

Bank Of Maharashtra Recruitment: బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్రలో ఉద్యోగాలు.. చివరి తేదీ ఎప్పుడు.. ఎలా అప్లై చేసుకోవాలంటే
Jobs In Bank Of Maharastra
Follow us on

Bank Of Maharashtra Recruitment 2021: ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్‌ అయిన బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర తాజాగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా జనరలిస్ట్‌ ఆఫీసర్‌ స్కేల్‌ II పోస్టులను భర్తీ చేయనున్నారు. 150 పోస్టులను రిక్రూట్‌ చేయనున్నారు. పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ను www.bankofmaharashtra.in సందర్శించవచ్చు.

ముఖ్యమైన విషయాలు..

* మొత్తం ఖాళీలు 150 (జనరల్‌ 62, ఈడబ్ల్యూఎస్ 15, ఓబీసీ 40, ఎస్సీలకు 22, ఎస్టీలకు 11)
* ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి.
* 2021, మార్చి 22 నుంచి ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రారంభం కానుంది.
* 2021, ఏప్రిల 6 రిజిస్ట్రేషన్లకు చివరి తేది.
* ఆన్‌లైన్‌ ఎగ్జామ్‌, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థిని ఎంపిక చేసుకుంటారు.
* ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు.. 60 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. సీఏ, ఐసీడబ్ల్యూఏ, సీఎఫ్ఏ, ఎఫ్ఆర్ఎం వంటి కోర్సులు పాసైనవారికి ప్రాధాన్యం ఉంటుంది. ఏదైనా షెడ్యూల్డ్‌ కమర్షియల్ బ్యాంకులో మూడేండ్లపాటు ఆఫీసర్‌గా పనిచేసిన అనుభవం ఉండాలి.
* ఇక అభ్యర్థులు 25 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన వారై ఉండాలి.
* అప్లికేషన్‌ ఫీజు: రూ.1,180, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.118

ఎలా అప్లై‌ చేసుకోవాలంటే..

* ముందుగా బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర అధికారిక వెబ్‌సైట్‌ ttps://www.bankofmaharashtra.in లోకి వెళ్లాలి.
* అనంతరం హోమ్‌ పేజీలో ఉన్న ‘కెరీర్స్‌’ ఆప్షన్‌ను క్లిక్‌ చేయాలి.
* తర్వాత ‘రిక్రూట్‌మెంట్‌ ప్రాసెస్‌’పై క్లిక్‌ చేసిన ‘కరెంట్‌ ఓపెనింగ్స్‌’ ట్యాబ్‌ను క్లిక్‌ చేయాలి.
* అనంతరం ‘క్లిక్‌ ఆన్‌ అప్లై ఆన్‌లైన్‌ ఫర్‌ రిక్రూట్‌మెంట్‌ ఆఫ్‌ జనరలిస్ట్‌ ఆఫీసర్స్‌ స్కేల్‌II 2021-22పై క్లిక్‌ చేయాలి.
* తర్వాత అన్ని వివరాలను ఎంటర్‌ చేసిన సబ్మిట్‌ బటన్‌పై క్లిక్‌ చేయాలి.

Also Read: TS Inter Exams 2021: ఇంటర్ పరీక్షల నిర్వహణపై స్పష్టం చేసిన బోర్డు .. ఆ రెండు పరీక్షలను విద్యార్థులు ఇంటినుంచి రాసే

అవకాశం

GIC Recruitment 2021: డిగ్రీ పాస్ అయిన వారికి శుభవార్త.. భారీ వేతనంతో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగావకాశాలు.. వివరాల్లోకి వెళ్తే..!

ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రాత పరీక్ష లేకుండానే పౌర సరఫరాల శాఖలో ఉద్యోగాలు.. ఖాళీల వివరాలివే..