Bank Of India Recruitment: బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో సెక్యూరిటీ ఆఫీసర్‌ పోస్టులు.. ఎలాంటి రాతపరీక్ష లేకుండానే ఎంపిక..

|

Dec 29, 2021 | 7:13 AM

Bank Of India Recruitment: బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (బీఓఐ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీచేసింది. ముంబయి ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ఈ బ్యాంక్‌లో పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌లో భాగంగా..

Bank Of India Recruitment: బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో సెక్యూరిటీ ఆఫీసర్‌ పోస్టులు.. ఎలాంటి రాతపరీక్ష లేకుండానే ఎంపిక..
Follow us on

Bank Of India Recruitment: బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (బీఓఐ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీచేసింది. ముంబయి ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ఈ బ్యాంక్‌లో పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌లో భాగంగా స్పెషలిస్ట్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? అర్హతలు ఎంటన్న పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 25 స్పెషలిస్ట్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు గ్రాడ్యుయేషన్‌/తత్సమాన ఉత్తీర్ణత సాధించాలి ఉండాలి.

* విద్యార్హతతో పాటు కంప్యూటర్‌ కోర్సులో సర్టిఫికేట్‌ ఉండాలి.

* వీటితో పాటు ఆర్మీ/నేవీ/ఎయిర్‌ఫోర్స్‌లో కనీసం ఐదేళ్లు ఆఫీసర్‌గా పనిచేసి ఉండాలి.

* అభ్యర్థుల వయసు 01-11-2021 నాటికి 25 నుంచి 40 ఏళ్‌ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను మొదట విద్యార్హతలు, అనుభవం ఆధానంగా షార్ట్‌లిస్టింగ్‌ చేస్తారు. అనంతరం పర్సనల్‌ ఇంటర్వ్యూ/గ్రూప్‌ డిస్కషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

* ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు 07-01-2021ని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: IND vs SA: మూడో రోజు ముగిసిన ఆట.. భారత్ సెకండ్‌ ఇన్నింగ్స్‌లో 1 వికెట్‌ నష్టానికి 16 పరుగులు

TS BJP: మిషన్‌-19..! తెలంగాణ బీజేపీ కొత్త టార్గెట్.. విజయమే లక్ష్యంగా బండి సంజయ్ ప్లానింగ్

Vangaveeti Radha: ప్రజాక్షేత్రంలో ఉండేవారికి ఎలాంటి భద్రత అక్కర్లేదు.. గన్‌మెన్‌ను వెనక్కు పంపిన వంగవీటి రాధా..