Bank of Baroda Recruitment 2023: బ్యాంక్ ఆఫ్ బరోడాలో 250 సీనియర్ మేనేజర్ పోస్టులు.. ఎంపికైతే రూ.1,12,400 వరకు జీతం

|

Dec 07, 2023 | 9:17 PM

ముంబయిలోని బ్యాంక్ ఆఫ్ బరోడా.. ఎంఎస్‌ఎంఈ విభాగంలో రెగ్యులర్ ప్రాతిపదికన సీనియర్ మేనేజర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం 250 సీనియర్ మేనేజర్- ఎంఎస్‌ఎంఈ రిలేషన్‌షిప్‌ (ఎంఎంజీ/ఎస్‌-III) పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా డిగ్రీ లేదా పీజీ/ ఎంబీఏ(మార్కెటింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌)లో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే సంబంధిత..

Bank of Baroda Recruitment 2023: బ్యాంక్ ఆఫ్ బరోడాలో 250 సీనియర్ మేనేజర్ పోస్టులు.. ఎంపికైతే రూ.1,12,400 వరకు జీతం
Bank Of Baroda
Follow us on

ముంబయిలోని బ్యాంక్ ఆఫ్ బరోడా.. ఎంఎస్‌ఎంఈ విభాగంలో రెగ్యులర్ ప్రాతిపదికన సీనియర్ మేనేజర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం 250 సీనియర్ మేనేజర్- ఎంఎస్‌ఎంఈ రిలేషన్‌షిప్‌ (ఎంఎంజీ/ఎస్‌-III) పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా డిగ్రీ లేదా పీజీ/ ఎంబీఏ(మార్కెటింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌)లో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి డిసెంబర్ 1, 2023 నాటికి 28 నుంచి 37 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో డిసెంబర్ 26, 2023వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద జనరల్ అభ్యర్ధులు రూ.600, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళలు రూ.100 తప్పని సరిగా చెల్లించవల్సి ఉంటుంది. ఆన్‌లైన్ పరీక్ష, సైకోమెట్రిక్ పరీక్ష, గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూ, వైద్య పరీక్ష, ధ్రువీకరణ పత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారు దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంక్ ఆఫ్ బరోడా కార్యాలయాలు/ శాఖల్లో పనిచేయవల్సి ఉంటుంది. ఉద్యోగం పొందిన వారు నెలకు రూ.63,840 నుంచి రూ.78,230 వరకు జీతంగా చెల్లిస్తారు.

ఎస్‌ఎస్‌సీ జేఈ రాత పరీక్ష తుది కీ విడుదల

దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థలు, శాఖల్లో 1,324 జూనియర్‌ ఇంజినీర్‌ గ్రూప్‌-బి (నాన్‌ గెజిటెడ్‌) పోస్టుల భర్తీ్కి సంబంధించి నిర్వహించిన రాత పరీక్ష (పేపర్‌-1) తుది ఆన్సర్‌ కీలను స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ తాజాగా విడుదల చేసింది. పేపర్‌-1 పరీక్షలు ఈ ఏడాది అక్టోబర్‌ 9 నుంచి 11వ తేదీ వరకు జరిగిన విషయం తెలిసిందే. పరీక్ష రాసిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో రోల్‌ నంబర్‌, పాస్‌వర్డ్‌ నమోదు చేసి ప్రశ్నపత్రం, ఆన్సర్‌ కీలను డిసెంబర్‌ 13వ తేదీలోగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తన ప్రకటనలో తెలిపింది. పేపర్‌-1 (కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌), పేపర్‌-2 (ఆఫ్‌లైన్‌ డిస్క్రిప్టివ్‌) రాత పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన అభ్యర్ధులకు నెలకు రూ.35,400 నుంచి రూ.1,12,400 వరకు జీతంగా చెల్లిస్తారు.

ఇవి కూడా చదవండి

నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.