
Bank Of Baroda Recruitment: బ్యాంక్ ఆఫ్ బరోడా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా వివిధ విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 220 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో పలు విభాగాల్లో జోనల్ సేల్స్ మేనేజర్‌తో పాటు, సీనియర్ మేనేజర్, వైస్ ప్రెసిండ్, రిజినల్ సేల్స్ మేనేజర్ వంటి పోస్టులు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా డిగ్రీ పూర్తి చసి ఉండాలి. పీజీ చేసిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.
* పోస్టుల ఆధారంగా సంబంధిత విభాగంలో 2 నుంచి 12 ఏళ్ల అనుభవం ఉండాలి.
* అభ్యర్థుల వయసు పోస్టులను అనుసరించి 22 నుంచి 48 ఏళ్ల మధ్య ఉండాలి.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ. 600, ఎస్‌సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళలు రూ. 100 ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను ముందుగా పని అనుభవం ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. అనంతరం ఇంటర్వ్యూ ద్వారా తుది ఎంపిక ఉంటుంది.
* దరఖాస్తుల స్వీకరణకు 14-02-2022తో గడువు ముగియనుంది.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: వింత శిశువు జననం !! నాలుగు కాళ్లు, నాలుగు చేతులతో !! వీడియో
Black Salt: గోరు వెచ్చని నీటిలో చిటికెడు నల్ల ఉప్పు.. పరగడుపున తాగితే అద్భుత ప్రయోజనాలు..?