Bank of Baroda Jobs 2021: గుడ్‌న్యూస్‌.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు.. రేపే చివరి తేదీ

Bank of Baroda Jobs 2021: ప్రస్తుతం నిరుద్యోగులకు ఎన్నో ఉద్యోగ అవకావశాలు లభిస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ వెలువడుతున్నాయి. అలాగే బ్యాంకింగ్‌..

Bank of Baroda Jobs 2021: గుడ్‌న్యూస్‌.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు.. రేపే చివరి తేదీ

Edited By: Subhash Goud

Updated on: Jul 14, 2021 | 6:24 PM

Bank of Baroda Jobs 2021: ప్రస్తుతం నిరుద్యోగులకు ఎన్నో ఉద్యోగ అవకావశాలు లభిస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ వెలువడుతున్నాయి. అలాగే బ్యాంకింగ్‌ రంగాల్లో కూడా ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. ఇక తాజాగా బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB) ఫైనాన్స్ విభాగంలో సీనియర్ పోస్టులను భర్తీ చేస్తోంది. ఇవి ఫిక్స్‌డ్ టర్మ్ కాంట్రాక్ట్ పోస్టులు. బిజినెస్ ఫైనాన్స్, ఇంటర్నల్ కంట్రోల్స్ అండ్ ఫైనాన్స్ గవర్నెన్స్, ఇన్వెస్టర్ రిలేషన్స్‌ విభాగాల్లో హెడ్ పోస్టులను, ఫైనాన్స్ అకౌంటింగ్, ఇన్వెస్టర్ రిలేషన్స్‌లో డిప్యూటీ హెడ్ పోస్టులు, బ్యాలెన్స్ షీట్ ప్లానింగ్, ప్రొడక్ట్ ప్రాఫిటబిలిటీ, బీయూ ప్రాఫిటబిలిటీ అండ్ ఎక్స్‌పెన్స్ మేనేజ్‌మెంట్‌లో వైస్ ప్రెసిడెంట్ పోస్టులను భర్తీ చేస్తోంది. ఇందులో మొత్తం 8 ఖాళీలున్నాయి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.bankofbaroda.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. అయితే దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. దరఖాస్తు చేసుకునేందుకు రేపే (జూలై 15) చివరి తేదీ. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.

ఈ పోస్టుల్లో హెడ్ (బిజినెస్ ఫైనాన్స్)- 1, హెడ్ (ఇంటర్నల్ కంట్రోల్స్ అండ్ ఫైనాన్స్ గవర్నెన్స్)- 1, హెడ్ (ఇన్వెస్టర్ రిలేషన్స్‌)- 1, డిప్యూటీ హెడ్ (ఫైనాన్స్ అకౌంటింగ్)- 1, డిప్యూటీ హెడ్ (ఇన్వెస్టర్ రిలేషన్స్‌)- 1, వైస్ ప్రెసిడెంట్ (బ్యాలెన్స్ షీట్ ప్లానింగ్)- 1, వైస్ ప్రెసిడెంట్ (ప్రొడక్ట్ ప్రాఫిటబిలిటీ)- 1, వైస్ ప్రెసిడెంట్ (బీయూ ప్రాఫిటబిలిటీ అండ్ ఎక్స్‌పెన్స్ మేనేజ్‌మెంట్‌)- 1 పోస్టులు ఉన్నాయి.

విద్యార్హతల వివరాలు:

ఈ పోస్టుల్లో వేర్వేరు విద్యార్హతలున్నాయి. ఎంబీఏ ఫైనాన్స్, సీఏ, సీఎఫ్ఏ, సీఎంఏ లాంటి కోర్సులు పూర్తి చేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలు నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు. 9 ఏళ్ల నుంచి 15 ఏళ్ల వరకు అనుభవం ఉండాల్సి ఉంటుంది. ఇక హెడ్ పోస్టుకు 38 ఏళ్ల నుంచి 45 ఏళ్లు, డిప్యూటీ హెడ్ పోస్టుకు 35 ఏళ్ల నుంచి 40 ఏళ్లు, వైస్ ప్రెసిడెంట్ పోస్టుకు 32 ఏళ్ల నుంచి 40 ఏళ్లు. దరఖాస్తు ఫీజు జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.600. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు రూ.100. దరఖాస్తుల షార్ట్ లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ఇవీ కూడా చదవండి:

Telangana Jobs: యూనివర్సిటీల్లో ఖాళీల భర్తీకి కొత్త ప్రణాళిక.. రాతపరీక్షలు నిర్వహించే ఆలోచనలో తెలంగాణ సర్కార్

JEE Main Admit Card 2021: జేఈఈ మెయిన్ అభ్యర్థులకు అలెర్ట్.. అడ్మిట్ కార్డులు విడుదల.. పరీక్షలు ఎప్పుడంటే?