BOB Recruitment: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక..

|

Nov 23, 2021 | 1:49 PM

BOB Recruitment: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వ రంగానికి చెందిన ఈ బ్యాంకు కాంట్రాక్ట్‌ విధానంలో ఖాళీలను భర్తీ చేయనుంది. నోటిఫికేషన్‌లో భాగంగా..

BOB Recruitment: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక..
Bob Recruitment
Follow us on

BOB Recruitment: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వ రంగానికి చెందిన ఈ బ్యాంకు కాంట్రాక్ట్‌ విధానంలో ఖాళీలను భర్తీ చేయనుంది. నోటిఫికేషన్‌లో భాగంగా పలు విభాగాల్లో ఉన్న మొత్తం 376 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయో విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? అలాంటి పూర్తి వివరాలు..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 376 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో సీనియర్‌ రిలేషన్‌షిప్‌ మేనేజర్లు (326), ఈ-వెల్త్‌ రిలేషన్‌షిప్‌ మేనేజర్లు (50) పోస్టులను భర్తీ చేయనున్నారు.

* సీనియర్‌ రిలేషన్‌షిప్‌ మేనేజర్లు పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఏదైగా డిగ్రీ ఉత్తీర్ణతో పాటు సంబంధిత పనిలో రెండేళ్ల అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయసు 01-11-2021 నాటికి 24 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

* ఈ-వెల్త్‌ రిలేషన్‌షిప్‌ మేనేజర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఏదైనా డిగ్రీతో పాటు సంబంధిత పనిలో ఏడాదిన్నర అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయసు 01-11-2021 నాటికి 35 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను మొదట పని ఆధారంగా షార్ట్‌ లిస్టింగ్ చేస్తారు. అనంతరం ఇంటర్వ్యూ/ గ్రూప్‌ డిస్కషన్‌ ద్వారా తుది ఎంపిక చేస్తారు.

* జనరల్‌/ ఓబీసీ అభ్యర్థులు రూ. 600, ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ/ మహిళలు రూ. 100 చెల్లించాల్సి ఉంటుంది.

* ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు 09-12-2021ని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Covid-19 Booster Dose: బూస్టర్ డోసు అవసరంపై ICMR ఆసక్తికర వ్యాఖ్యలు

India vs New Zealand, 1st Test: బయో బబుల్ రూల్స్ బ్రేక్ చేసిన ద్రవిడ్-రహానే.. ఎక్కడికి వెళ్లారంటే?

GoDaddy Hacked: ప్రపంచంలోనే అతిపెద్ద వెబ్‌సైట్ డొమైన్ హోస్ట్ గో డాడీ హ్యాక్.. ప్రమాదంలో12 లక్షల మంది డేటా..!