ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. నోటిఫికేషన్‌లో భాగంగా ఎంఎస్ఎంఈ, ట్రాక్టర్ లోన్ విభాగంలో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాల మీకోసం..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 87 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో జోనల్ సేల్స్ మేనేజర్ (ఎంఎస్ఎంఈ బిజినెస్), జోనల్ సేల్స్ మేనేజర్ (ఎంఎస్ఎంఈ – సీవీ/సీఎంఈ), రీజినల్ సేల్స్ మేనేజర్ (ట్రాక్టర్ లోన్), అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ ఎంఎస్ఎంఈ – సేల్స్, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ ఎంఎస్ఎంఈ – సేల్స్ -ఎల్ఏపీ/అన్ సెక్యూర్డ్ బిజినెస్ లోన్స్, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ ఎంఎస్ఎంఈ – సేల్స్ సీవీ/సీఎంఈ లోన్స్, సీనియర్ మేనేజర్ ఎంఎస్ఎంఈ – సేల్స్, సీనియర్ మేనేజర్ ఎంఎస్ఎంఈ – సేల్స్ -ఎల్ఏపీ/అన్ సెక్యూర్డ్ బిజినెస్ లోన్స్, సీనియర్ మేనేజర్ ఎంఎస్ఎంఈ – సేల్స్ ఫారెక్స్ (ఎక్స్ పోర్ట్/ఇంపోర్ట్ బిజినెస్), మేనేజర్ ఎంఎస్ఎంఈ – సేల్స్ పోస్టులు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దీంతో పాటు సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
* అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* దరఖాస్తుల స్వీకరణకు మే11వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..