Bank Of Baroda Recruitment: ప్రముఖ భారత ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ యూనిట్లలో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈపోస్టులను కాంట్రాక్ట్ విధానంలో తీసుకోనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 115 బిజినెస్ కరస్పాండెంట్ సూపర్ వైజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
* ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ (ఎంఎస్ ఆఫీస్, ఈమెయిల్, ఇంటర్‌నెట్) ఉండాలి.
* ఎమ్మెస్సీ (ఐటీ), బీఈ (ఐటీ), ఎంసీఏ/ఎంబీఏ కోర్సులు చేసిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.
* అభ్యర్థుల వయసు 21 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* దరఖాస్తు దారులను మొదట స్క్రుటిని ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. అనంతరం ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
* దరఖాస్తుల స్వీకరణకు ఆయా రిజియన్ల ఆధారంగా సెప్టెంబర్ 10 నుంచి 30 వరకు నిర్ణయించారు.
* అభ్యర్థులు దరఖాస్తులను నేరుగా బ్యాంక్ ఆఫ్ బరోడాకి చెందిన సంబంధిత రీజియన్ కార్యాలయాల్లో అందజేయాలి.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: Telegram Feature: సెట్ చేసుకున్న సమయానికి మెసేజ్.. టెలిగ్రామ్‌లో ఉన్న ఈ క్రేజీ ఫీచర్ మీకు తెలుసా?