Telegram Feature: సెట్ చేసుకున్న సమయానికి మెసేజ్.. టెలిగ్రామ్‌లో ఉన్న ఈ క్రేజీ ఫీచర్ మీకు తెలుసా?
Telegram Feature: పలనా సమయానికి మీ స్నేహితుడికో లేదా మరెవరికో ఓ ఇంపార్టెంట్ మెసేజ్ పంపాల్సి ఉంటుంది. తీరా ఆ సమయానికి గుర్తుండకపోవడమో..? లేదా..
Telegram Feature: పలనా సమయానికి మీ స్నేహితుడికో లేదా మరెవరికో ఓ ఇంపార్టెంట్ మెసేజ్ పంపాల్సి ఉంటుంది. తీరా ఆ సమయానికి గుర్తుండకపోవడమో..? లేదా మరో పనిలో పడిపోయి బిజీగా ఉన్నారనుకోండి అప్పుడు పరిస్థితి ఏంటీ.? సమయానికి పంపాల్సిన సందేశాన్ని పంపలేకపోతారు. అయితే మీరు కోరుకున్న సమయానికి మెసేజ్‌ను పంపించేలా ఏదైనా ఆప్షన్ ఉంటే భలే ఉంటుంది కదూ.! అచ్చంగా ఇలాంటి అవకాశాన్నే కలిపించింది టెలిగ్రామ్ మెసేజింగ్ యాప్.
ఉదాహరణకు మర్నాడు మీ స్నేహితుడి పుట్టిన రోజు ఉంటుంది. అర్ధరాత్రి 12 గంటలకు మెసేజ్ పంపాలనుకుంటారు.. కానీ ఆ సమయానికి గుర్తుండకపోతే, లేదా నిద్ర పోతే ఎలా.? అలా కాకుండా రాత్రి 12 గంటలకు ఆటోమెటిక్‌గా మెసేజ్ వెళ్లేలా చేసుకునే ఫీచర్ టెలిగ్రామ్‌లో ఉందని మీకు తెలుసా.? ఇందుకోసం ముందుగా టెలిగ్రామ్ యాప్‌ను ఓపెన్ చేయాలి. అనంతరం మీరు మెసేజ్ చేయాలనుకుంటున్న వారి చాట్‌ను ఓపెన్ చేసి, ఏ మెసేజ్ అయితే టైప్ చేయాలనుకుంటున్నారో చేసి.. అనంతరం మెసేజ్‌పై లాంగ్ ప్రెస్ చేయాలి. దీంతో షెడ్యూల్ మెసేజ్ ఫీచర్ కనిపిస్తుంది. దానిపై నొక్కి తేదీ, సమయాన్ని ఎంచుకోవాలి. దీంతో మీరు ఎంటర్ చేసిన సమయానికి ఆ మెసేజ్ కాస్త అవతలి వ్యక్తికి చేరుతుంది. అంతేకాకుండా మీరు పంపిన మెసేజ్ అవతలి వ్యక్తి ఆన్‌లైన్‌లోకి వచ్చినప్పుడే చేరేలా కూడా పంపించుకునే అవకాశం ఉంది.
Also Read: Viral News: ‘యూ బ్లడీ ఫూల్’ అంటోన్న బాతు.. ఆడియో రికార్డ్ సోషల్ మీడియాలో వైరల్..!