
Bank Note Press Dewas
సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పరిధిలోని దేవాస్ (ఎంపీ)లోని బ్యాంక్ నోట్ ప్రెస్.. 111 సూపర్‌వైజర్, జూనియర్ టెక్నీషియన్ తదితర పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఐటీఐ, డిప్లొమా, బీఈ, బీటెక్, బీఎస్సీలో ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌లో ఆగస్టు 21, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, టైపింగ్ స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్ రాత పరీక్ష తేదీ సెప్టెంబర్/ అక్టోబర్ 2023లో ఉంటుంది.
పోస్టుల వివరాలు..
- సూపర్‌వైజర్ (ప్రింటింగ్) పోస్టులు: 8
- సూపర్‌వైజర్ (కంట్రోల్) పోస్టులు: 3
- సూపర్‌వైజర్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) పోస్టులు: 1
- జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు: 4
- జూనియర్ టెక్నీషియన్ (ప్రింటింగ్) పోస్టులు: 27
- జూనియర్ టెక్నీషియన్ (కంట్రోల్) పోస్టులు: 25
- జూనియర్ టెక్నీషియన్ (ఇంక్ ఫ్యాక్టరీ-అటెండెంట్ ఆపరేటర్/ ల్యాబొరేటరీ అసిస్టెంట్/ మెషినిస్ట్/
- మెషినిస్ట్ గ్రైండర్/ ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్) పోస్టులు: 15
- జూనియర్ టెక్నీషియన్ (మెకానికల్/ ఎయిర్ కండిషనింగ్) పోస్టులు: 3
- జూనియర్ టెక్నీషియన్ (ఎలక్ట్రికల్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) పోస్టులు: 4
- జూనియర్ టెక్నీషియన్ (సివిల్ / ఎన్విరాన్‌మెంట్) పోస్టులు: 1
మరిన్ని కెరీర్ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.