
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఉన్న చారిత్రాత్మక బనారస్ హిందూ యూనివర్సిటీ (BHU).. ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ట్రయల్ మేనేజర్ (రిసెర్చ్ అసోసియేట్), రిసెర్చ్ ఫెలో ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో డిసెంబరు 5, 2025వ తేదీలోపు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్ చేసుకోండి..
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 55 శాతం మార్కులతో ఎంఏ, ఎమ్మెస్సీ, పీహెచ్‌డీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే ఉద్యోగానుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల గరిష్ఠ వయోపరిమితి 28 ఏళ్ల నుంచి 42 ఏళ్లకు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ, మహిళా అభ్యర్ధులకు వయోపరిమితిలో ఐదేళ్ల వరకు సడలింపు ఉంటుంది.
ఆసక్తి కలిగిన వారు ఈమెయిల్ ద్వారా createindia2025@gmail.com. డిసెంబర్ 5, 2025వ తేదీలోపు దరఖాస్తులను పంపించవల్సి ఉంటుంది. ఎలాంటి రాత పరీక్షలేకుండానే ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి ట్రయల్ మేనేజర్ పోస్టులకు నెలకు రూ.80 వేలు, రీసెర్చ్ ఫెలో పోస్టులకు నెలకు రూ.60 వేల వరకు జీతంగా చెల్లిస్తారు.
బనారస్ హిందూ యూనివర్సిటీ ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.